Tourist Places: క్రిస్మస్ సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే అరకు పర్ఫెక్ట్.. ఈ ప్రాంతాలు తప్పకుండా చూడాల్సిందే

Christmas Tour Plan: మరో వారం రోజుల్లో క్రిస్మస్ హాలీడేస్ వస్తున్నాయి. దాదాపు 6 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండబోతున్నాయి. ఈ క్రిస్మస్ సెలవుల్లో మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే తక్కువ సమయంలో చూడాలంటే అరకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అరకులో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడి  ప్రకృతి అందాలను మనల్ని కట్టిపడేస్తుంటాయి. గుహలు, వాటర్ ఫాల్స్, సెలయేర్లతోపాటు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అరకులోయ పరిసరాల్లో తప్పకుండా చూడాల్సి బెస్ట్ ప్రాంతాలు ఏవో చూద్దాం. 
 

1 /7

Araku Tourist Places: ప్రకృతి అందాలతో అరకులోయ మనల్ని మైమరిపించేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఇక్కడి వాతావరణం, పచ్చదనం, పర్యాటక ప్రాంతాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. జలపాతాలు, సెలయేర్లు గలగలలు, గిరుల అందాలు మనస్సుకుహత్తుకుంటాయి. డిసెంబర్ లో వచ్చే క్రిస్మస్ కు అరకు వెళ్లేందుకు సరైన సమయం. 

2 /7

శీతాకాలంలో ఇక్కడి పచ్చదనం మరింత ఆకర్షిణీయకంగా కనిపిస్తుంది.  ప్రకృతి  ఆస్వాదించే వారికి ఇదొక స్వర్గం అని చెప్పవచ్చు. ఏడాది చివరి నెల అయిన డిసెంబర్ లో వెకేషన్ వెళ్లాలనుకుంటే అల్లూరి జిల్లా పరిధిలో ఉన్న అరకులోయ బాగుంటుంది. విశాఖకు అరకు సుమారు 113 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.   

3 /7

అరకులోయ పరిసరాల్లో కచ్చితంగా చూడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అరకులోయ నుంచి బొర్రా గుహలు 26కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పురాతనమైన అత్యంత లోతైన సున్నపురాయి గుహలు ఇవి. అనంతగిరి హిల్స్ ప్రాంతంలోనే ఈ గుహలు ఉంటాయి. ఈ గూహలు చూస్తే ప్రత్యేక అనుభూతి పొందవచ్చు. ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది.   

4 /7

అరకుకు సమారు 36కిలోమీటర్ల దూరంలో అనంతగిరి హిల్స్ ఉంటాయి. ఈ హిల్ స్టేషన్  ప్రకృతి ప్రేమికులను చాలా ఆకట్టుకుంటుంది. అరకులోయకు వెళ్లినవారంతా ఇక్కడికి వెళ్లడం మర్చిపోవద్దు. కాఫీ తోటలు, జలపాతాలు, పచ్చటి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.   

5 /7

అరకులోయకు 13కిలోమీటర్ల దూరంలోనే చాపరాయి జలపాతం ఉంటుంది. పాడేరు అడవుల మధ్యలో నీరు జాలువారుతుంది. చాపరాయి జలపాతం దగ్గర ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు.   

6 /7

అరకులోనే ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. అరకులోయలో నివసించే గిరిజనుల సంప్రదాయాలు, జీవన విధానం చరిత్రను ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు. ఇక్కడి వస్తువుల ఎంతగానో ఆకట్టుకుంటాయి. అరకు వెళ్లినవారు కచ్చితగా ట్రైబల్ మ్యూజియంను సందర్శించాలి.   

7 /7

అరకు ట్రిప్ కు వెళ్లినట్లయితే లంబసింగి కూడా వెళ్తే బాగుంటుంది. చలికాలంలో లంబసింగి చూడటానికి బాగుంటుంది. చల్లటి వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో అప్పుడప్పుడు మంచు కురుస్తుంది.