Venus Transit 2025: శని పాలించే గ్రహంలోకి శుక్రుడు.. లక్కు అంటే ఈ రాశులదే.. దిమ్మతిరిగే బెనిఫిట్స్‌!

Venus Transit into Aquarius: అతి త్వరలోనే శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించబోతోంది. ప్రస్తుతం ఈ గ్రహం మకర రాశిలో సంచార దశలో ఉంది. శుక్ర గ్రహం ఏ రాశిలోనైనా దాదాపు 32 రోజులపాటు సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ఈ గ్రహం డిసెంబర్ 28న మకర రాశిని వదిలి శని పాలించే కుంభరాశిలోకి పరిగెత్తబోతున్నాడు. 
 

Venus Transit into Aquarius Effect On 3 Zodiac Signs: శనీశ్వరుడు పాలించే కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలిగితే అశుభ స్థానంలో ఉన్నవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ సమయంలో అత్యధికంగా లాభాలు పొందే రాశుల ఏంటో తెలుసుకోండి.
 

1 /7

ముఖ్యంగా శుక్రుడు శని పాలించే కుంభరాశిలోకి వెళ్లడం వల్ల అక్కడ రెండు గ్రహాల కలయిక జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మిథున రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి అదృష్టం సహకరించి అరుదైన లాభాలు పొందుతారు.     

2 /7

అలాగే మిథున రాశి వారు పోటీ పరీక్షలు విజయవంతంగా రాస్తారు. అంతేకాకుండా వాటి నుంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇక పేదలకు నిత్యవసర సరుకులు ఇతర వస్తువులను దానం చేయగలుగుతారు. దీంతోపాటు మీరు ఎలాంటి పనులు చేపట్టిన విజయాలు సాధించే అద్భుతమైన అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు.    

3 /7

వృషభ రాశి వారికి కూడా శుక్రుడు ఇతర రాశిలోకి ప్రవేశించడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి శుక్రుడు కర్మ గృహంలో ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల గత కొంతకాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ లభిస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.     

4 /7

వృషభ రాశి వారు శుక్రుడు రాశి సంచారం చేయడం వల్ల యాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి కూడా కొంత పురోగతి లభిస్తుంది. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా అదృష్టం మీ వెంట ఉంటుంది.    

5 /7

మేష రాశి వారికి కూడా శుక్రుడు మకర రాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగడమే కాకుండా ఎలాంటి పనులు చేపట్టిన కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ముఖ్యంగా కుటుంబాల పరంగా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.     

6 /7

అలాగే మేష రాశి వారు వ్యాపారాల్లో పురోగతి సాధించడమే కాకుండా ఇంటర్నేషనల్ ఒప్పందాలు కూడా పొందగలుగుతారు. దీనివల్ల వ్యాపారాల నుంచి ఊహించని డబ్బులు కూడా లభిస్తాయి. ఇక ఎప్పటినుంచో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నావారికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది.  

7 /7

నోట్‌: ఈ వార్త కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు..