Heavy Rains: తీరం దాటనున్న అల్పపీడనం.. ఈ 3 జిల్లాలకు అతి భారీ వర్షాలు..

Heavy Rains In AP 3 Districts: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులో తీరం దాటనున్న అల్పపీడనం వల్ల ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం...
 

1 /5

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు నెలలుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతునే ఉన్నాయి.   

2 /5

ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తమిళనాడులో తీరం దాటనుంది. ఈ అల్పపీడనం వల్ల ప్రధానంగా యానాంలో తమిళనాడులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  

3 /5

ఇక కాకినాడ, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా ఈ అల్పపీడనం ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. మత్స్య కారులు కూడా సముద్రంలో చేపల కోసం వేటకు వెళ్ల కూడదని హెచ్చరించింది.  

4 /5

ఇక అల్ప పీడనం ప్రభావం వల్ల విజయవాడ, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని,  ఈ ప్రాంతంలో దక్షిణ కోస్తా తీరంలో గంటకు 50 కీలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.   

5 /5

స్కూళ్లకు కూడా వర్షాలు కురిసే జిల్లాల్లో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలెర్ట్‌ చేస్తున్నారు.