YouTube: రూ.8 లక్షలు ధారపోసినా యూట్యూబ్‌తో రూపాయి రాలే.. ఛానల్‌ ఎత్తేసిన యువతి

Waste Of Time Woman Quits YouTube Career X Post Viral: యూట్యూబ్‌ నుంచి భారీగా ఆదాయం వస్తుందని భావించి భారీగా పెట్టుబడి పెట్టి వీడియోలు చేయడం మొదలుపెడితే ఎలాంటి స్పందన రాలేదు. మూడేళ్ల నుంచి కష్టపడుతున్నా రూపాయి రాకపోవడంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం యూట్యూబ్‌ను బహిష్కరించిన వార్త వైరల్‌గా మారింది.

1 /10

జీవితంలో భాగం: ఈ కాలంలో ప్రతి ఒక్కరూ యూట్యూబ్‌ చూస్తున్నవాళ్లే. యూట్యూబ్‌ వాడకం లేనివాళ్లు అంటూ లేరు. అంతలా యూట్యూబ్‌ మానవ జీవితంలో భాగమైంది.

2 /10

వృత్తిగా యూట్యూబ్‌: చూసేవాళ్లతోపాటు అందులో కంటెంట్‌ ఇచ్చేవాళ్లు భారీగా ఉంటున్నారు. యూట్యూబ్‌ కంటెంట్‌ అనేది వృత్తిగా మారింది.

3 /10

భారీగా పెట్టుబడి: యూట్యూబ్‌ను జీవితంగా చేసుకోవాలని ఉత్తర భారతదేశానికి చెందిన నళిని ఉనాగర్‌ అనే యువతి భారీగా పెట్టుబడులు పెట్టింది.

4 /10

భారీగా కొనుగోలు: యూట్యూబ్‌ వీడియోలు చేసేందుకు నళిని రూ.8 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. భారీ స్థాయిలో కిచెన్‌ సెట్టింగ్‌, కెమెరా, ఎడిటింగ్‌ పరికరాలు కొనుగోలు చేసింది.

5 /10

ఛానల్స్‌ ప్రారంభం: అన్ని పరికరాలు కొన్న అనంతరం ఫుడ్‌ ఫ్యాక్ట్స్‌ బై నళిని, నళినిస్‌ కిచెన్‌ రిసిపీస్‌ అంటూ రెండూ యూట్యూబ్‌ ఛానల్స్‌ తెరిచింది.

6 /10

వంటకాల వీడియోలు: కొత్త కొత్త వంటకాలు తయారు చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్‌ ఛానల్స్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇలా మూడేళ్లు కష్టపడింది.

7 /10

కానరాని స్పందన: కంటెంట్‌ భారీగా వస్తున్నా నెటిజన్ల నుంచి స్పందన చాలా తక్కువగా ఉంది. మూడేళ్లు గడిచినా 15 వేల మంది సబ్‌స్క్రైబర్లు రాలేకపోయారు.

8 /10

రూపాయి రాలేదు: నెటిజన్ల నుంచి స్పందన రాకపోవడంతోపాటు యూట్యూబ్‌ నుంచి రూపాయి ఆదాయం రాలేదు. దీంతో నళినికి చిర్రెత్తుకొచ్చింది.

9 /10

భారీగా నష్టం: భారీగా యూట్యూబ్‌పై పెట్టుబడి పెట్టి నష్టపోయానని.. తన కెరీర్‌ పోయిందని 'ఎక్స్‌' వేదికగా నళిని ఉనగర్‌ వాపోయింది. ఆమె చేసిన పోస్టు వైరల్‌గా మారింది. యూట్యూబ్‌తో తాను ఎదుర్కొన్న కష్టాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా దీనికి భారీగా స్పందన లభించింది.

10 /10

వీడియోలు డిలీట్‌: యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన 250 వీడియోల కంటెంట్‌ డిలీట్‌ చేశానని.. ఇకపై వీడియోలు చేయనని సంచలన ప్రకటన చేసింది. భారీగా ఖర్చు చేసి కొన్న వంట గది పరికరాలు, స్టూడియో పరికరాలు వంటివి అమ్ముతున్నట్లు ప్రకటించింది.