Goa Tourism: సంవత్సరం ముగింపు సీజన్ అవ్వడంతో గోవాకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. హాలిడే సీజన్, న్యూఇయర్ ను ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. న్యూఇయర్, క్రిస్మస్ కు గోవాలో జోష్ మామూలుగా ఉండదు. అంతేకాదు విమానాలు రికార్డు స్థాయిలో గోవాలో ల్యాండ్ అవుతుంటాయి. హోటల్స్ బుకింగ్స్ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అసలు న్యూఇయర్ సెలబ్రేషన్స్ అనగానే చాలా మందికి గోవానే ఎందుకు గుర్తుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Goa Tourism: భారతదేశంలో గోవా అతి చిన్న రాష్ట్రం. గోవా దేశంలోనే కాదు ...ప్రపంచ దేశాల్లోనూ చాలా ఫేమస్. గోవాకు దేశంలో నలుమూలల నుంచే కాదు ప్రపంచంలోని దేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. గోవాలో రాత్రి గడిపేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సాధారణ రోజుల్లోనే కాదు..న్యూఇయర్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ పార్టీలు ఏవైనా సరే గోవాలో వాలిపోతుంటారు. ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి తరలిరావడానికి కారణం ఇదే.
గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా బీచ్ లను చాలా అందంగా ముస్తాబు చేస్తుంటారు. సాయంత్రం 6 దాటింది అంటే గోవా బీచ్ లన్నీ కూడా రంగురంగుల లైట్లతో అందంగా కనిపిస్తాయి. చాలా చోట్ల బీచ్ లలో స్పెషల్ పార్టీలు, డిన్నర్ లు ఏర్పాటు చేస్తుంటారు. డిసెంబర్ 31న, గోవాలోని ప్రసిద్ధ బీచ్లు బాగా, కలంగుటే, అంజునా, పలోలెం బీచ్లలో జరిగే పార్టీలు చాలా ఫేమస్. న్యూ ఇయర్ సందర్భంగా అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలు కూడా ఉంటాయి.
బీచ్ పార్టీలే కాదు, న్యూ ఇయర్ సందర్భంగా గోవాలోని చాలా చోట్ల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరుగుతాయి. గోవా సంప్రదాయ కళాకారులు తమ నృత్యం, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. జానపద కళాకారులు బహిరంగ వేదికపై కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మీరు ఇక్కడ ఆహార పానీయాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు.
మీరు కూడా ఈసారి న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలంటే గోవా బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ మాండోవి నది ఒడ్డున క్రూయిజ్లపై నిర్మించిన కాసినోలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాదు మీరు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి గోవా రాజధాని పనాజీలో అనేక కాసినోలు ఉన్నాయి.
గోవాలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ అనేక సంగీత కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో ప్రముఖ గాయకుల పాటలు లైవ్ షోలు ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా గోవాలోని చర్చిలల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి మాస్ ఇక్కడ నూతన సంవత్సరం సాయంత్రం అంటే డిసెంబర్ 31న నిర్వహిస్తారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు.
క్రిస్మస్, న్యూఇయర్ సమీపివేస్తున్న వేళ గోవాకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. న్యూఇయర్ వేడుకులను గోవాలో సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది ఆశిస్తుంటారు. పార్టీలు కూడా ఎక్కువ సంఖ్యలో జరుగుతాయి కాబట్టి ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారు.
ఇక న్యూఇయర్ సమీపిస్తున్న వేళ అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో ఆ రాష్ట్ర అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యూజిక్ ఫెస్టివల్స్, ఫుట్ బాల్ ఈవెంట్లతోపాటు మరిన్ని కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాటి కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు.