Millionaire Sign In Astrology: కలలో ఇవి కనిపిస్తే.. నిజంగానే కోటీశ్వరులవ్వడం ఖాయం!

Millionaire Sign In Astrology Full Details Here: జీవితంలో ఎవరైనా వ్యక్తికి అదృష్టం కలిసొచ్చి భగవంతుడు అనుగ్రహిస్తే కోటీశ్వరుడు అవుతాడు. అలా కావడానికి ముందు మూడు సంకేతాలు మనకు తారసపడతాయని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది ఆ సంకేతాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆ వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /6

అదృష్టం కలిసి వస్తే అంతా మంచే జరుగుతుందని అంటుంటారు. ఆ అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది? భగవంతుడు అనుగ్రహిం ఎప్పుడు లభిస్తుంది?..మన కర్మ ఫలితం ఎప్పుడు ఎలా తొలగిపోతుంది. ఎప్పుడు ధనవంతులవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.    

2 /6

 చాలామంది ధనవంతులు అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే భగవంతుడు ఇవ్వాలని అనుకున్నప్పుడు అదృష్టం కలిసొస్తే... స్వామి తన అనంత హస్తాలతోటి ఎంత కావాలంటే అంత  అక్షయంగా అందిస్తూ ఉంటాడు. దానిని అందిపుచ్చుకోవాలంటే మనకు కూడా కాస్త యోగ్యతను కలిగి ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.    

3 /6

అంతేకాకుండా కోటీశ్వరుడు కావడానికి కర్మఫలం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కర్మ ఫలితం తొలగితేనే ధనం, సిరిసంపదలు లభిస్తాయి. అయితే జీవితంలో కోటీశ్వరులు అవ్వటానికి ముందు మూడు సంకేతాలు మనకు కనిపిస్తాయి.  

4 /6

మొదటిది ఏమిటంటే తెల్లవారుజాము మూడు గంటలకు పదేపదే మెలకువ రావటం.. ఇది సామాన్యమైన విషయం కాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇది చాలా శుభకరమైన సంకేతంగా భావిస్తారట.. ఈ తెల్లవారుజాము మూడు గంటలకు సమస్త దేవతల శక్తి జాగ్రతమవుతుంది. కాబట్టి ఇప్పుడు మెలుకువ వస్తే తప్పకుండా దేవతల అనుగ్రహం లభిస్తుంది.  

5 /6

రెండోది మనకు కలలో ఎత్తైన పర్వతాలు జల ధారలు కనిపించడం.. అంతేకాకుండా ఆ నీటిని మనం తాగినట్టు కలలో రావడం.. ఇది కూడా ఒక చక్కటి శుభసంకేతంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలా కనిపిస్తే.. మన సంకల్పాలు ఎంతో త్వరగా నెరవేరుతాయి.     

6 /6

ఇక మూడోది కలలో మనకు దేవి దేవతలు కనిపించడం.. ఇది కూడా చాలా శుభ సంకేతంగా భావిస్తారు. దేవతలు కలలో కనిపిస్తే చాలా పవిత్రమైన వ్యక్తిగా ముందు ముందు కాబోతారని కూడా చక్కటి సంకేతం. అంటే మనం నిత్యం ప్రార్థించే దేవి దేవతలు ఎవరైనా కూడా కలలో కనిపిస్తే.. కూడా మంచి శుభ సూచికమని, త్వరలోనే ధనవంతులు కూడా అవుతారని సంకేతాలు.