Virat Kohli: భార్యాపిల్లలతో భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్న విరాట్‌ కోహ్లీ!

Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతున్న కోహ్లీ తన కుటుంబంతో సహా భారతదేశాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

1 /8

కుటుంబంతో హాయిగా: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌తో హాయిగా జీవిస్తున్నాడు.

2 /8

కుటుంబానికి ప్రాధాన్యం: క్రికెట్‌ మ్యాచ్‌లు లేని సమయంలో కోహ్లీ కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే త్వరలోనే కోహ్లీ భారత్‌ను విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

3 /8

విదేశాలకు మకాం: భార్యాపిల్లలతో కలిసి కుటుంబంతో సహా విదేశాల్లో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

4 /8

కోచ్‌ కీలక వ్యాఖ్యలు: కోహ్లీ భారతదేశాన్ని విడిచివెళ్లిపోవడంపై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు. 'తమ పిల్లలకు మెరుగైన జీవనశైలి.. వాతావరణాన్ని కల్పించేందుకు కోహ్లీ జంట లండన్‌లో స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నారు' అని రాజ్‌ కుమార్‌ శర్మ తెలిపారు.

5 /8

విదేశాల్లో స్థిరపడడం: ఓ హిందీ దినపత్రికకు అందించిన సమాచారం ప్రకారం.. 'విరాట్ త్వరలో తన కుటుంబంతో కలిసి భారతదేశాన్ని విడిచిపెట్టాలని యోచిస్తున్నాడు.  తమ పిల్లలకు అందమైన జీవితం అందించాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు' అని రాజ్‌కుమార్‌ చెప్పినట్లు సమాచారం.

6 /8

ముంబైలో నివాసం: ప్రస్తుతం కోహ్లీ, అనుష్క దంపతులు పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నట్లు సమాచారం. అక్కడే వామిక ఓ పాఠశాలలో చదువుతున్నట్లు తెలుస్తోంది.

7 /8

స్వేచ్ఛా జీవితం: భారతదేశంలో కోహ్లీ, అనుష్కలను ప్రతిఒక్కరూ గుర్తు పడతారు. దేశంలో స్వేచ్ఛగా తిరగాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ను విడిచిపెట్టే యోచనలో ఈ దంపతులు ఉన్నారు.

8 /8

వాస్తవం ఏమిటి?: వామిక, అకాయ్‌ స్వేచ్ఛాయుత జీవితం ఇచ్చేందుకు కోహ్లీ, అనుష్క విదేశాలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి ఇది వాస్తవమా? కాదా అనేది తెలియాల్సి ఉంది.