Vijay Mallya Home Pics: విజయ్ మాల్యా ఇంటిని చూశారా.. భూలోక స్వర్గమే!

Vijay Mallya Kingfisher Towers Pent House Inside Photos Viral: భారత పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆయన అనూహ్యంగా అనుకోని పరిణామాలతో దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే భారతదేశంలో ఉన్న అతడి ఇల్లు ఇంకా భద్రంగా ఉంది. ఆ ఇంటిని చూస్తే భూలోక స్వర్గమే అని అనక మానరు. అతడి ఇంటి ఫొటోలు ఇలా ఉన్నాయి.

1 /11

వెలుగు వెలిగిన మాల్యా: భారత పారిశ్రామికవేత్తగా ఒక వెలుగు వెలిగిన విజయ్‌ మాల్యా అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అతడు భారతదేశాన్ని వదిలి పారిపోయాడు.

2 /11

పైకప్పు: విజయ్‌ మాల్యా బెంగళూరులో నివాసం ఉన్న విషయం తెలిసిందే. భూమికి 400 అడుగుల ఎత్తులో 34 అంతస్తుల భవనం పైకప్పుపై రెండంతస్తుల నివాసం నిర్మించుకున్నాడు. 

3 /11

శ్వేత సౌధంలా: ఆ ఇంటిపై నుంచి చూస్తే బెంగళూరు నగరం మొత్తం కనిపిస్తుంది. ఈ బంగ్లా అమెరికా అధ్యక్ష నివాసం శ్వేతసౌధంలా ఉంటుంది.

4 /11

కింగ్‌ ఫిషర్‌ టవర్స్‌: బెంగళూరులోని యూబీ సిటీలోని కింగ్‌ఫిషర్ టవర్‌పై విజయ్‌ మాల్యా నివాసం ఉంటుంది. మొత్తం 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది.

5 /11

భారీగా అంతస్తులు: విజయ్ మాల్యాకు దేశంలో చాలా ఇళ్లు ఉన్నా కూడా బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్‌లో ఉన్న ఈ భవనం అత్యంత ప్రత్యేకం. ఈ భవనంలో 33 అంతస్తులు, 81 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

6 /11

పెంట్‌ హౌస్‌: బెంగుళూరులోని ఒక ఆకాశహర్మ్యం పైన 40,000 చదరపు అడుగుల పెంట్ హౌస్ ఉంది. ఇది తెలుపు రంగులో ధగధగలాడుతూ ఉంది.

7 /11

విలాసవంతమైన సౌకర్యాలు: ఈ ఇంటిలో ఓపెన్ స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇంట్లో మాల్యా వ్యక్తిగత లాబీ.. ఇల్లు-కార్యాలయం, ప్రైవేట్ లిఫ్ట్ ఉన్నాయి.

8 /11

కళ్లు చెదిరే రేటు: అపార్ట్‌మెంట్లు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మాల్యాకు చెందిన ఈ ప్యాలెస్ ధర 20 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.170 కోట్లు.

9 /11

ఒక్కో ఫ్లాట్ ధర: ఈ భవనంలో ఒక ఫ్లాట్ ధర రూ.50 కోట్లకు పైగా ఉంటుంది. దేశంలోని చాలా మంది బిలియనీర్ వ్యాపారవేత్తలు ఈ సొసైటీలో ఫ్లాట్‌లను కలిగి ఉన్నారు.

10 /11

ప్రముఖుల నివాసం: కింగ్ ఫిషర్ టవర్స్ లో ఇన్ఫోసిస్‌కు చెందిన నారాయణ మూర్తి, సుధా మూర్తి, జెరోడాకు చెందిన నిఖిల్ కామత్, బయోకాన్‌కు చెందిన కిరణ్ మజుందార్ షా వంటి చాలా మంది వ్యాపారవేత్తలు ఈ భవనంలో ఇళ్లను కొనుగోలు చేశారు.

11 /11

ఇతరులు నివాసం: ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఈ ఇంట్లో మాల్యా ఉండలేకపోగా.. ప్రస్తుతం అతడి కొడుకు కోడలు నివసిస్తున్నారు.