Samantha Networth vs Sobhita Networth: సమంత - శోభితలో ఎవరు అత్యంత ధనవంతులో తెలుసా..?

Samantha Networth: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య తో విడాకులు తీసుకొని సమంత,  నాగచైతన్యను వివాహం చేసుకొని శోభిత ధూళిపాళ ఇద్దరు కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున వారసుడిగా అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.  తన ప్రయత్నాలతో పర్వాలేదు అనిపించుకుంటున్న నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఇందులో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. మొదటి సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు సమాచారం.  

2 /5

అలా దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకున్నారు. అయితే అనూహ్యంగా 2021లోనే విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా సమంతతో విడాకులైన తర్వాత మరుసటి ఏడాది ఏప్రిల్ లో శోభిత ధూళిపాలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2024 ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది.ఇక ఈ ఏడాది డిసెంబర్ 4న వివాహం చేసుకొని ఒకటయ్యారు ఈ జంట. 

3 /5

ఇక నాగచైతన్య శోభిత ను  వివాహం చేసుకోవడంతో మరొకవైపు శోభిత, సమంత ఆస్తులను కంపేర్ చేస్తూ ఎవరు ధనవంతులు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇక అందులో బాగానే సమంత విషయానికొస్తే..గత 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. దీనికి తోడు సౌత్ సినిమాలతో పాటు ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీలో కూడా వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి తోడు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న ఈమె దాదాపు రూ.100 కోట్లకు పైగా నికర ఆస్తులు కలిగినట్లు సమాచారం. 

4 /5

ఇక శోభిత విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 8 సంవత్సరాలవుతుంది.ఈ నేపథ్యంలోనే ఈమెకు అవకాశాలు కూడా పెద్దగా రాలేదు అటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఇప్పటివరకు కేవలం రూ.10 కోట్లు మాత్రమే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. 

5 /5

ఇక దీన్ని బట్టి చూస్తే శోభిత కంటే సమంత ఆస్తి విషయంలో చాలా ఎత్తులో ఉందని చెప్పవచ్చు. అయితే నాగచైతన్య ను శోభిత.వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఆస్తులు కూడా ఈమెకి చెల్లుతాయి కాబట్టి ఇప్పుడు ఈమె ఆస్తి మరింత ఎక్కువ అని తెలుస్తోంది ఏది ఏమైనా వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తుల విషయానికొస్తే సమంత ఆస్తులు మరింత ఎక్కువ అని చెప్పవచ్చు.