Year Ender 2024 Disaster Movies: 2024 డబ్బింగ్ సినిమాల్లో డిజాస్టర్స్ ఇవే..

Year Ender 2024 Disaster Movies: 2024లో డబ్బింగ్ సినిమాల్లో మెజారిటీ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు. దాదాపు తెలుగులో విడుదలైన బడా తమిళ స్టార్ హీరోల సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి.

1 /7

ముఖ్యంగా 2024 జనవరిలో విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత రజినీకాంత్ అతిథి పాత్ర అని పూర్తి పాత్ర చేసిన ‘లాల్ సలాం’, కమల్ హసన్ భారతీయుడు 2, విక్రమ్ .. తంగలాన్, సూర్య కంగువా చిత్రాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి.

2 /7

కెప్టెన్ మిల్లర్.. ధనుశ్ హీరోగా శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ సినిమా తమిళంలో పొంగల్ కానుకగా విడుదలైంది. కానీ తెలుగులో మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

3 /7

లాల్ సలాం.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. ఈ సినిమాలో రజినీకాంత్ కు చాలా యేళ్ల తర్వాత సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగులో కనీసం ఓపెనింగ్స్ రాబట్టలేక చతికిల బడింది.  

4 /7

తంగలాన్.. విక్రమ్ హీరోగా  పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళం సహా రెండు భాషల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.  

5 /7

భారతీయుడు 2.. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. తెలుగులో భారతీయుడు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బిగ్గెస్ట్  డిజాస్టర్ గా నిలిచింది.

6 /7

వేట్టయ్యాన్.. రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వేట్టయ్యన్’. ఈ సినిమా తెలుగు, తమిళం సహా రెండు భాషల్లో డిజాస్టర్ గా నిలిచింది.

7 /7

కంగువా.. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కంగువా’. ఈ సినిమా ఈ యేడాది మన దేశంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ప్రేక్షకులను జుగుప్సా కలిగించేలా ఉండటంతో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల తిరస్కరకు గురైంది.