బీజేపీ నేత, కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త శెట్టిపల్లి లలిత్ సంజీవరెడ్డి, రక్షిత వివాహ వేడుకను బెంగుళూరు ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు.
బీజేపీ నేత, కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త శెట్టిపల్లి లలిత్ సంజీవరెడ్డి, రక్షిత వివాహ వేడుకను బెంగుళూరు ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు. (Pic Courtesy - Jaipal Sharma)
కర్ణాటక గవర్నర్ వజుభాయి వాలా, ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, మంత్రులు, తదితర ప్రముఖులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి అమ్మాయి తండ్రి రక్షితకు పెళ్లి పనులలో సాయం చేశారు. వేడకకు హాజరైన ప్రముఖులకు గాలి జనార్ధన్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు.
వందల కోట్ల ఖర్చుతో అంగరంగ వైభవంగా కూతురు రక్షిత వివాహ వేడుకను మంత్రి శ్రీరాములు నిర్వహించారు.
శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహ వేడక ఖర్చు కర్ణాటకలో హాట్ టాపిక్ అవుతోంది. ఎక్కడ చూసినా కూతురు రక్షిత పెళ్లికి శ్రీరాములు చేసిన ఖర్చుపైనే చర్చించుకోవడం గమనార్హం.
కాగా, వరుడు సినిమాలో 5 రోజుల పెళ్లి చూశారు కానీ కర్ణాటక మంత్రి శ్రీరాములు మాత్రం తన కూతురు రక్షిత వివాహ వేడుకను ఏకంగా 9 రోజుల పాటు నిర్వహించడం విశేషం.
ఫిబ్రవరి 27న బళ్లారిలో రక్షిత పెళ్లి సంబరాలు మొదలైన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉంది. కానీ బిజీ షెడ్యూళ్ల కారణంగా హాజరు కాలేకపోయారని బీజేపీ నేతలు తెలిపారు.
2016లో జరిగిన గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం తరహాలో భారీగా ఖర్చు చేసి శ్రీరాములు తన కూతురు రక్షిత వివాహం జరిపించారు. అయితే ఖర్చు గురించి ఎక్కువగా చర్చించవద్దని పార్టీ నేతలకు శ్రీరాములు సూచించినట్లు సమాచారం.
తొమ్మిది రోజుల పెళ్లి వేడుకకు దాదాపు రూ.500 కోట్ల ఖర్చు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
(Pics Courtesy - Jaipal Sharma)
Next Gallery