Tirumala: వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌అలెర్ట్‌.. కీలక సూచనలు చేసిన టీటీడీ..!

Tirumala Vaikunta Ekadashi: తిరుమల వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశుని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. టీటీడీ యంత్రాంగం తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
 

1 /5

జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. అయితే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వెళ్లే భక్తులకు కీలక ఆదేశాలు టీటీడీ జారీ చేసింది.  

2 /5

జనవరి 9 రేపు ఉదయం 5 గంటల నుంచి 10, 11, 12 తేదీలకు సంబంధించిన లక్ష 20 వేల టోకెన్‌లను తిరుపతిలోని 8, తిరుమలలో ఓ కేంద్రంలో కేటాయిస్తామన్నారు. భక్తులకు తగిన సూచనలు చేశారు. ఈ నియమాలను భక్తులు ముందుగానే పాటిస్తే ఇబ్బందులు పడకుండా ఉండొచ్చని చెప్పారు.  

3 /5

ఇక 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఏరోజుకు ఆరోజు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. తిరుమలలో పదిరోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.  

4 /5

ఈ వైకుంఠ ద్వార దర్శనం దాదాపు 7.5 లక్షల మందికి కల్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సరైన ఏర్పాట్లు చేశారు. మూడు వేల మంది పోలీసులు, 1500 మంది సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు తెలిపారు.   

5 /5

ముఖ్యంగా టైమ్‌ స్లాట్‌ ప్రకారమే వైకుంఠ ద్వార దర్శనాలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజుల్లో వీఐపీలు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఆహారం వంటి సదుపాయాలు కల్పించనన్నామని చెప్పారు.