Beer Supply Suspend: మందుబాబులకు భారీ షాక్.. తెలంగాణలో బీర్ల అమ్మకాలు బంద్

UBL Sensation Decision Beer Supply Suspended In Telangana State: మందుబాబులకు భారీ షాక్‌ తగిలింది. ఇకపై తెలంగాణలో బీర్లు లభించకపోవచ్చు. బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు బీర్ల కంపెనీలు ప్రకటించాయి. అత్యధికంగా అమ్ముడయ్యే కింగ్‌ ఫిషర్‌తోపాటు హైన్‌కెన్‌ బీర్ల సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీలు తెలిపాయి. దీంతో తెలంగాణలో బీర్లు అందుబాటులో ఉండవు.

1 /8

సంక్రాంతి పండుగకు ముందు తెలంగాణ మందుబాబులకు చేదు వార్త ఇది. ఇకపై బీర్ల విక్రయాలు ఉండవు.

2 /8

తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్‌ తగిలింది. ఇకపై తెలంగాణలో బీర్లు విక్రయాలు ఉండకపోవచ్చు.

3 /8

బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ప్రభుత్వంతో ఏర్పడిన వివాదంతో కంపెనీలు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

4 /8

ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆరు నెలలుగా ఆగిపోయాయి. ఆ బిల్లులకు సంబంధించి ప్రభుత్వాన్ని అడుగుతున్నా విడుదల కావడం లేదు.

5 /8

రెండు త్రైమాసికాలకు కలిపి దాదాపు రూ.900 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పుడు పండుగ సీజన్‌తో కలిపితే రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉందని తెలుస్తోంది.

6 /8

బిల్లుల విషయంలో చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కంపెనీలు బీర్ల సరఫరాను ఆపివేస్తున్నట్లు ప్రకటించాయని సమాచారం.

7 /8

బీర్ల సరఫరా నిలిపివేయడం అనేది తాత్కాలికం అని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే శాశ్వతంగా బీర్ల సరఫరా నిలిపివేసే అవకాశం కూడా ఉంది.

8 /8

బిల్లుల అంశంతోపాటు బీర్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీర్ల కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. 2019-20 నుంచి ఇప్పటివరకు బీర్ల ధరలు పెంచుకోవడానికి తెలంగాణ బేవరేజెస్‌ అనుమతించడం లేదు. దీనిపై యునైటెడ్‌ బ్రేవరీస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆగ్రహంతో ఉంది.