Iron Rich Foods: మనిషి ఆరోగ్యం, శరీర నిర్మాణం, ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు అవసరమౌతాయి. ఇందులో మినరల్స్, విటమిన్లు కీలకం. వీటిలో ఏది లోపించినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి మినరల్స్ ఐరన్. శరీరంలో ఐరన్ లోపిస్తే హిమోగ్లోబిన్ కొరత ఏర్పడుతుంది.
Iron Rich Foods: హిమోగ్లోబిన్ అనేది శరీరంలోని వివిధ అంగాలకు ఆక్సిజన్ సరఫరాలో ఉపయోగపడుతుంది. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపముంటే ఎనీమియా, అలసట, బలహీనత వంటి సమస్యలు తప్పవు. అందుకే మీ డైట్లో ఈ 5 ఫుడ్స్ ఉంటే ఐరన్ లోపం ఎప్పటికీ తలెత్తదు.
దానిమ్మ దానిమ్మ రుచిగా ఉండటమే కాకుండా ఐరన్ పుష్కలంగా ఉండే ఫ్రూట్. శరీరంలో రక్త హీనతను దూరం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఒక దానిమ్మ తింటే ఇక ఎప్పటికీ హిమోగ్లోబిన్ లేదా ఐరన్ కొరత ఏర్పడదు
బీట్రూట్ బీట్రూట్లో ఐరన్‌తో పాటు ఫోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. హిమోగ్లోబిన్ కొరత ఏర్పడదు
పాలకూర పాలకూర అనేది ఐరన్ రిచ్ ఫుడ్. ఇందులో ఐరన్‌తో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి ద్వారా లభించే ఐరన్ సంగ్రహణకు విటమిన్ సి ఉపయోగపడుతుంది. 100 గ్రాముల పాలకూర తీసుకుంటే అందులో దాదాపుగా 2.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, అంజీర్, ఖర్జూరంలో ఐరన్ పెద్దమొత్తంలో ఉంటుంది. శరీరానికి ఎనర్జీ అందిస్తుంది. ఐరన్ లోపం పూర్తవుతుంది. రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే శరీరానికి చాలా మంచిది.
పప్పులు బీన్స్ మసూర్ దాల్, శెనగలు, పెసర వంటి పప్పుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇక రాజ్మా, సోయాబీన్లో కూడా ఐరన్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఓ గిన్నెడు బీన్స్ లేదా పప్పు తీసుకుంటే అందులో శరీరానికి రోజువారీ కావల్సిన అవసరాలు పూర్తవుతాయి.