అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం తరహాలోనే బుధవారం ఏప్రిల్ 1 నాడు కూడా రాష్ట్రంలో మరో 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 111కు చేరింది. ఈ మేరకు ఏపీ సర్కార్ తరపున రాష్ట్ర నోడల్ అధికారి డా అర్జ శ్రీకాంత్ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. రాత్రి 7 గంటల తర్వాత విడుదలైన కోవిడ్ పరీక్షల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించినట్టు నోడల్ అధికారి డా అర్జ శ్రీకాంత్ తెలిపారు. Gandhi hospital: డాక్టర్లపై దాడి ఘటన.. స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి
ఏపీ సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాల వారీగా వివరాలిలా ఉన్నాయి.
క్ర. సంఖ్య | జిల్లా పేరు | మొత్తం కేసుల సంఖ్య | కోలుకున్న వారి సంఖ్య |
---|---|---|---|
1 | అనంతపూర్ | 2 | |
2 | చిత్తూరు | 6 | |
3 | తూర్పు గోదావరి | 9 | |
4 | గుంటూరు | 20 | |
5 | కడప | 15 | |
6 | కృష్ణా | 15 | |
7 | కర్నూలు | 1 | |
8 | నెల్లూరు | 3 | 1 |
9 | ప్రకాశం | 15 | |
10 | విశాఖపట్నం | 11 | 1 |
11 | పశ్చిమ గోదావరి | 14 | |
111 | 2 |
కరోనావైరస్ లైవ్ అప్డేట్స్ కోసం జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Flash: ఏపీలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు.. జిల్లాల వారీగా వివరాలు