అల్లు అర్జున్ 'పుష్ప' ఫస్ట్ లుక్

'అల వైకుంఠపురములో..' సూపర్ డూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మంచి ఫామ్‌లో ఉన్నాడు.  ఇవాళ   స్టైలిస్ స్టార్ బన్నీ బర్త్ డే కూడా. కాబట్టి ఈ సందర్భంగా  బన్నీ నటించిన కొత్త చిత్రం పుష్ప ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 

Last Updated : Apr 8, 2020, 12:16 PM IST
అల్లు అర్జున్ 'పుష్ప' ఫస్ట్ లుక్

'అల వైకుంఠపురములో..' సూపర్ డూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మంచి ఫామ్‌లో ఉన్నాడు.  ఇవాళ   స్టైలిస్ స్టార్ బన్నీ బర్త్ డే కూడా. కాబట్టి ఈ సందర్భంగా  బన్నీ నటించిన కొత్త చిత్రం పుష్ప ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 

అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం  టైటిల్ నిన్నటి వరకు బయటకు రాలేదు. ఐతే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సినిమా ఫస్ట్ లుక్‌ను అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం  వహిస్తున్నారని.. అలాగే సంగీత దర్శకత్వం దేవీ శ్రీ ప్రసాద్  నిర్వహిస్తారని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అంతే కాదు కొత్త లుక్ అభిమానులు ఇష్టపడతారని ధీమా వ్యక్తం చేశాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Welcome to the World of Pushpa Raj పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा

A post shared by Allu Arjun (@alluarjunonline) on

మరోవైపు ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ   సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మొత్తంగా నిన్న మొన్నటి వరకు స్టైలిష్ స్టార్‌గా కనిపించిన అల్లు అర్జున్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కొత్త లుక్ రఫ్‌గా కనిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News