Coronavirus deaths: 24 గంటల్లోనే 2,108 మంది మృతి

అమెరికాలో కరోనా వైరస్‌ కారణంగా ఒక్కరోజులోనే 2,108 మంది మృతి చెందడం ఆ దేశ పౌరులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం కరోనా వైరస్ కారణంగా ఒక దేశంలో 24 గంటల్లోనే ఇంతమంది చనిపోవడం అనేది ఇదే తొలిసారి.

Last Updated : Apr 12, 2020, 06:28 AM IST
Coronavirus deaths: 24 గంటల్లోనే 2,108 మంది మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ కారణంగా ఒక్కరోజులోనే 2,108 మంది మృతి చెందడం ఆ దేశ పౌరులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం కరోనా వైరస్ కారణంగా ఒక దేశంలో 24 గంటల్లోనే ఇంతమంది చనిపోవడం అనేది ఇదే తొలిసారి. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 18,860 మంది చనిపోయారు. దీంతో ఒక రోజు మరణాల సంఖ్య పరంగా అయినా, అత్యధిక మృతుల సంఖ్య పరంగా తీసుకున్నా అమెరికా ఇటలీని దాటేసి ప్రపంచదేశాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది.

Also read : Plasma collection: కోలుకున్న వాళ్ల ప్లాస్మాను సేకరించి కరోనా పాజిటివ్ రోగులకు ఎక్కించే వైద్యం

ది గార్డియన్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం అమెరికాలో కరోనా డెత్ టోల్ 20,000 దాటుతుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోనే కరోనాతో అత్యధిక మంది మృత్యువాతపడ్డారు. న్యూయార్క్‌లో శుక్రవారం ఒక్క రోజే 783 మంది చనిపోగా... శుక్రవారం నాటి సంఖ్యతో కలుపుకుని ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 8,627కి చేరింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News