Photos: తెలంగాణలో మహత్తర ఘట్టం

  • May 29, 2020, 09:01 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మహత్తర ఘట్టం చోటుచేసుకుంది. నేడు కొండపోచమ్మ సాగర్ ఒడిలోకి కాళేశ్వరం జలాలు రానున్నాయి. మార్కూక్ పంప్ హౌస్ స్విచ్ఛాన్ చేయగానే గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి.

1 /11

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మహత్తర ఘట్టం చోటుచేసుకుంది. నేడు కొండపోచమ్మ సాగర్ ఒడిలోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి.

2 /11

3 /11

కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

4 /11

నేటి (మే 29న) ఉదయం మర్కూక్ పంప్ హౌజ్ ద్వారా కొండపోచమ్మ సాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రెండు మోటర్లను ప్రారంభించారు. మూడేళ్ల కిందట ప్రారంభమైన కాళేశ్వర గంగ ప్రస్థానంలో నేడు సుందర దృశ్యం ఆవిష్కారం కానుంది.

5 /11

కాగా, తెలంగాణలోనే అత్యంత ఎత్తయిన (618 మీటర్లు) ప్రాంతానికి గోదావరి నీటిని ఎత్తిపోయడం విశేషం. 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా ఇంతర ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తారు.

6 /11

7 /11

8 /11

9 /11

10 /11

11 /11