Sushant Singh Rajput Death: Karan joharను Unfollow చేసిన లక్షల మంది నెటిజన్లు..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. సుశాంత్ కు అవకాశాలు రాకుండా చేసినవారిలో కరణ్ 

Last Updated : Jun 18, 2020, 10:42 PM IST
Sushant Singh Rajput Death: Karan joharను Unfollow చేసిన లక్షల మంది నెటిజన్లు..

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. సుశాంత్ కు అవకాశాలు రాకుండా చేసినవారిలో కరణ్ కూడా ఉన్నాడంటూ, సుశాంత్ ఆత్మహత్యకు పరోక్ష కారకుడన్న వాదనల మధ్య దాదాపు లక్షమంది నెటిజన్లు సామజిక మాధ్యమాల్లో కరణ్ జొహార్ ను అన్ ఫాలో చేశారు.

Also Read: త్వరలో విచారణకు సుశాంత్ గాళ్‌ఫ్రెండ్, నటి

ఇదిలాఉంటే కరణ్ జొహార్ సైతం అనేకమంది బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్రముఖులను అన్ ఫాలో చేశారు. ట్విట్టర్ లో కరణ్ ఇప్పుడు కేవలం ఎనిమిది మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. వారిలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ వంటివారు ఉన్నారు. సుశాంత్ వ్యవహారంలో తాను ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందన్న ఆవేదనలో కరణ్ జొహార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలో కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సుశాంత్ పై వ్యాఖ్యలు చేసిన అలియా భట్ ను కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘సుశాంత్ నుంచి ఇలాంటి ఫినిష్ ఊహించలేదు’
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News