సుశాంత్ ఆత్మహత్యపై సరోజ్ ఖాన్ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వైరల్

Saroj Khan's Last Instagram post on Sushant Singh Rajput | గత నెలలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. అయితే తాజాగా కన్నుమూసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ నలుగు సుశాంత్ మరణంపై చేసిన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.

Last Updated : Jul 3, 2020, 09:13 AM IST
సుశాంత్ ఆత్మహత్యపై సరోజ్ ఖాన్ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వైరల్

Saroj Khan dies of cardiac arrest | బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) నేడు గుండెపోటుతో ముంబైలోని గురునానక్ ఆస్పత్రిలో కన్నుమూయడం(Saroj Khan Died) తెలిసిందే. ఆమె అభిమానులు, ఇండస్ట్రీ ప్రముకులు ముద్దుగా మాస్టర్‌జీ, మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ అని పిలిచేవారు. 200కు పైగా సినిమాల్లో నాలుగు దశాబ్దాలపాటు ఇండస్ట్రీకి ఎనలేని సేవలు చేశారు. అయితే ఆమె మరణం(Saroj Khan Death)తో సోషల్ మీడియాలో చివరగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మీద చేసి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్మ ఆత్మహత్యపై సరోజ్ ఖాన్(Saroj Khan On Sushant Singh Rajput) ఎంతో భావోద్వేగంతో స్పందించారు. తానెప్పుడూ అతడితో కలిసి పనిచేయలేదని, కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటే తనకు ఇష్టమన్నారు. అయితే సుశాంత్ తన కష్టాలు, బాధల్ని పెద్దవారితో పంచుకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆ పోస్టులో సరోజ్ ఖాన్ రాసుకొచ్చారు. ఇప్పుడు వారి కుటుంబం పరిస్థితి ఎలా ఉందో, సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సరోజ్ ఖాన్ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. హీరో నితిన్ పెళ్లి తేది, వేదిక ఖరారు

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I had never worked with you @sushantsinghrajput but we have meet many times. What went wrong in your LIFE?I'm shocked that you took such a drastic step in your LIFE. You could have spoken to an Elder which could have helped YOU and would have kept us Happy looking at YOU. God bless your soul and I don't know what your Father and Sister's are going through. Condolences and Strength to them to go through this Time. I Loved you in all your Movies and will always Love you. R.I.P🙏🙏

A post shared by Saroj Khan (@sarojkhanofficial) on

కాగా 200కు పైగా సినిమాలకు కొరియోగ్రఫి అందించిన సరోజ్ ఖాన్ చివరగా 2019లో కరణ్ జోహర్ తెరకెక్కించిన ‘కళంక్’ సినిమాకు పనిచేశారు. మాధురీ దీక్షిత్‌కు ‘తబా హో గయే’ పాటకు కొరియోగ్రఫి చేశారు. ఆమె కెరీర్‌లో 3 జాతీయ అవార్డులను సాధించడం విశేషం.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

Trending News