Wierd: కోడి కూసిందని.. యజమానికి జరిమానా వేశారు

ఉదయాన్నే కోడి కూసింది ( Rooster Crow ) అని.. చుట్టుపక్కల వారిని తెగ చిరాకు పెట్టింది అని దాని యజమానికి ఫైన్ వేశారు పోలీసులు ( Police ). వినడానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపించవచ్చు.

Last Updated : Aug 15, 2020, 04:42 PM IST
Wierd: కోడి కూసిందని.. యజమానికి జరిమానా వేశారు

ఉదయాన్నే కోడి కూసింది ( Rooster Crow ) అని.. చుట్టుపక్కల వారిని తెగ చిరాకు పెట్టింది అని దాని యజమానికి ఫైన్ వేశారు పోలీసులు ( Police ). వినడానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. ఎందుకంటే కోడికి ఉదయం కూయడం అలవాటే. ప్రపంచ (World )  వ్యాప్తంగా జరగే తంతు ఇది. పైగా కోడి కూస్తే మన దగ్గర గుడ్ మార్నింగ్ కు ( Good Morning ) సింబల్.  కానీ లాంబర్డీలోని ఒక పట్టణంలో 80 సంవత్సరాల పెద్దాయన ఒక కోడిని పెంచుకుంటున్నాడు. దాని పేరు కార్లినో. అది ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ప్రతీ రోజు కూస్తూనే ఉంటుందట. దీంతో లేట్ నైట్ నిద్ర పోయే చుట్టుపక్కల వారికి నిద్రకు భంగం కలుగుతోందట. 

 

Home Making : బల్లులతో ఇబ్బందా.. ఇలా చేయండి
దాంతో కోడిని పెంచుతోన్న పెద్దాయనకు చెప్పి చూశారు. కానీ ఆయనేం చేయగలడు. కోడికి కూతపెట్టకు అని చెప్పలేడు కదా. అలా కోడి కూస్తూనే ఉంది. చుట్టుపక్కల వారి నిద్ర డిస్టర్బ్ అవుతూనే ఉంది. ఇక చాలు అనుకుకున్నారో ఏమో కానీ ఒక రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో దర్యాప్తు చేసిన పోలీసులు యజమానికి సుమారు రూ.15 వేల జరిమానా వేశారు.Niharika:నిహరిక నిశ్చితార్థం వీడియో షేర్ చేసిన నాగబాబు

Trending News