Ward Volunteers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సచివాలయం వ్యవస్థ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సాధిస్తోంది. ప్రజలకు వివిధ సదుపాయాలు అందించడంతో పాటు వారికి ఇంటి నుంచే సేవలు అందిస్తోండంటంతో ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవస్థ విజయం సాధిస్తోండంతో ఏపి ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఇందులో భాగంగా నెలకు ఒకసారి గ్రామ సచివాలయ సిబ్బంది భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది వైయస్ జగన్ (CM Jagan) ప్రభుత్వం. తాజాగా గ్రామ సచివాలయాల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పంచాయతి రాజ్ మంత్రి రాజ్ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు.
అన్ని సచివాలయాల (Grama Sachivalayam) కోసం ఇకపై శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. అంటే గ్రామ సచివాలయాలు త్వరలో శాశ్వత భవనాల్లో పనిచేయడం మొదలుపెడతాయి. నిధుల కొరత ఉన్నప్పటికి మార్చి నుంచి గ్రామ సచివాలయాల నిర్మాణంలో వేగం పుంజుకోనుంది అని తెలిపారు మంత్రి. ఈ మేరకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది.
Also Read | Rythu Bandhu: త్వరలో మరో విడత రైతు బంధు ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
AP: త్వరలో శాశ్వత భవనాల్లో గ్రామ సచివాలయాలు