Home Quarantine: లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటి నుంచి కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో పాటే రికవరీ రేటు కూడా పెరుగుతోంది. అయితే వ్యాక్సీన్ వచ్చేంత వరకు ప్రమాదం మాత్రం పొంచి ఉంది అని చెప్పవచ్చు. అలాంటి సమయంలో కోవిడ్-19 సోకి వారు ఇంట్లోనే క్వారంటైన్ అవ్వాలి అనుకుంటే వారికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
ఇంట్లో క్వారెంటైన్ అవుతున్నప్పుడు...వెంటిలేషన్ ఉన్న గదిలో ఎంచుకోవాలి. సెపరేట్ బాత్రూమ్ ఉండాలి.
బయటికి వెళ్లకూడదు..ఇంట్లో ఉన్న సభ్యులకు దూరంగా ఉండాలి. భౌతిక దూరంగా ఉండాలి.
హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న వారు వృద్ధులు, గర్భవతి మహిళ నుంచి దూరంగా ఉండాలి. పిల్లలతో దూరం పాటించాలి.
కోవిడ్-19 సోకిన తరువాత ప్రభుత్వం నిర్ధేశించిన గడువు వరకు ఇంట్లోనే ఉండాలి. బయటికి వెళ్లకూడదు.
క్వారైంటన్‌లో ఉన్న సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. చేతులు తరచూ కడగడం, శానిటైజ్ చేయడం చేస్తుండాలి.
పోషకతత్వాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. దాంతో పాటు వాడిన వస్తువలను జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి.