Winter health tips for fair skin and good looking hair | చలికాలంలో చర్మానికి, తల వెంట్రుకలకు రక్షణ ఎంతో అవసరం. మాస్క్ ధరించడం వల్ల చర్మానికి కలిగే ఇబ్బందులను, శీతాకాలంలో తలెత్తే సమస్యల పట్ల జాగ్రత్త వహించకపోతే గ్లామర్ పరంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
Health tips for fair skin and beautiful hair in Winter season | చలికాలంలో చర్మానికి, తల వెంట్రుకలకు రక్షణ ఎంతో అవసరం. మాస్క్ ధరించడం వల్ల చర్మానికి కలిగే ఇబ్బందులను, శీతాకాలంలో తలెత్తే సమస్యల పట్ల జాగ్రత్త వహించకపోతే గ్లామర్ పరంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో చర్మంలోని తేమ ఆవిరై చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మం మెరుపును కోల్పోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో దురదకు దారితీస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్లను రాసుకోవడం ద్వారా చర్మంలోని తేమ ఆవిరవకుండా ఉంటుంది.
చలికాలంలో ఎప్పుడూ ఉపయోగించే సాధారణ సబ్బులకు బదులుగా మైల్డ్ సోప్స్ వినియోగించాలి. లిక్విడ్ క్లీనర్లు కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా చలిని తట్టుకోవడం కోసం బాగా వేడిగా ఉన్న నీళ్ళతో స్నానం చేయడం కూడా సరికాదు. వేడి నీళ్ళు చర్మానికి హాని కలిగిస్తాయి. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే ఇబ్బందులు ఉండవు.
చలికాలంలో వెంట్రుకల్లోని తేమ ఆవిరై పొడిబారుతాయి. కనుక చలి కాలంలో మైల్డ్ షాంపూలే ( Mild shampoos ) వినియోగించాలి. తల స్నానానికి గంట ముందు నూనె రాసుకొని, మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలకు సరిపడా తేమ అందుతుంది. అలాగే తడి జుట్టుకు కండిషనర్ అప్లై ( How to apply hair conditioner ) చేసుకోవాలి.
శీతాకాలంలో చుండ్రు సమస్య మరీ ఎక్కువగా వేధిస్తుంటుంది. దీనికి యాంటీడాండ్రఫ్ షాంపూ ఎంచుకోవాలి. తల స్నానానికి గోరువెచ్చని నీళ్లే ఉపయోగించాలి. ప్రతీ రోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నట్టయితే.. చలికాలంలో వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాల్సి ఉంటుంది.