Aadhar card with Indane gas: ఆధార్ కార్డు అనేది ప్రస్తుతం అందరికీ ఓ నిత్యావసరంగా మారింది. గుర్తింపు కోసమైనా లేదా ప్రభుత్వం నుంచి సబ్సిడీ అంటే గ్యాస్ సబ్సిడీ పొందాలన్నా...ప్రతిచోటా ఆధార్ కార్డు అవసరముంది. అయితే మీ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో చూసుకోవడం తప్పనిసరి.
ఒకవేళ ఇండేన్ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఒక్క ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు మీ గ్యాస్ నెంబర్‌తో ఆధార్ నెంబర్‌ను లింక్ చేయవచ్చు. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 1800 2333 555 నెంబర్‌కు కాల్ చేయాలి. కస్టమర్ కేర్ సిబ్బందికి మీ ఆధార్ నెంబర్ చెప్పి లింక్ చేసుకోవచ్చు.
మెస్సేజ్ పంపించిన వెంటనే మీ నంబర్ గ్యాస్ ఏజెన్సీతో రిజిస్టర్ అవుతుంది. తరువాత ఆధార్ కార్డు నెంబర్‌ను గ్యాస్ ఏజెన్సీతో లింక్ చేసేందుకు మరో మెస్సేజ్ పంపించాల్సి ఉంటుంది. దీనికోసం మెస్సేజ్ బాక్స్ లో UID ఆధార్ నెంబర్ టైప్ చేసి అదే నెంబర్‌కు పంపించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ గ్యాస్ నెంబర్‌తో మీ ఆధార్ కార్డు నెంబర్ లింక్ అవుతుంది.
ఒకవేళ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి లేకపోతే ఒక ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది. మెస్సేజ్ బాక్స్‌లో వెళ్లి IOC అని టైప్ చేసి గ్యాస్ ఏజెన్సీ టెలీఫోన్ నెంబర్ ఎస్టీడీ కోడ్ టైప్ చేయండి. తరువాత కస్టమర్ కేర్ నెంబర్‌కు పంపించాలి.
ఆధార్ కార్డు లింక్ చేయడానికి మెస్సేజ్ పంపించడానికి ముందు మీ మొబైల్ నెంబర్ గ్యాస్ ఏజెన్సీతో లింక్ అయిందో లేదో అంటే రిజిస్టర్ అయిందో లేదో సరిచూసుకోవాలి. ఫోన్ నెంబర్ లింక్ అయుంటే..మీరు నేరుగా ఆధార్ కార్డు లింక్ చేయడానికి మెస్సేజ్ పంపించవచ్చు. నంబర్ లింక్ లేకపోతే మాత్రం మెస్సేజ్ పంపి రిజిస్టర్ చేయవచ్చు.
మీరు ఇప్పటివరకూ మీ ఆధార్ కార్డును గ్యాస్ ఏజెన్సీతో లింక్ చేయకపోతే చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చునే ఆ పని చేయవచ్చు. కేవలం ఒకే ఒక్క మెస్సేజ్ పంపించి. అవును నిజమే..ఇండేన్ గ్యాస్ తన ఖాతాదారుల కోసం ఇటీవల కొత్త సర్వీసు ప్రారంభించింది.