iPhone 13 Features: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 13 మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. గతేడాది కరోనా సమయంలోనూ ఐఫోన్ 12 లాంచ్ చేసి, వినియోగదారులకు 4 రకాల వేరియంట్లను అందించింది. ఈ ఏడాది ఐఫోన్ 13లో నాలుగు వేరియంట్లను తీసుకోస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. లీక్ అవుతున్న ఐఫోన్ 13 ఫీచర్లు ఇక్కడ అందిస్తున్నాం.
ఫోన్ 13 ఫీచర్లు, కొన్ని ఆసక్తికర విషయాలు (iPhone 13 Specifications)
ఐఫోన్ 13లో నాలుగు రకాల వేరియంట్ మొబైల్స్ మార్కెట్లో తీసుకురానుంది యాపిల్. ఐఫోన్ 12(iPhone 12) తరహాలోనే ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్.
- ఐఫోన్ 13 మొబైల్ డిస్ప్లే 6.1 అంగుళాలు ఉంది. ఐఫోన్ 13 ప్రో డిస్ప్లే 6.7 అంగుళాలు, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ డిస్ప్లే 6.7 అంగుళాలు. ఐఫోన్ 13 మినీ డిస్ప్లే 5.4 అంగుళాలతో రానుంది.
Also Read: FASTag: ఇక ఫాస్టాగ్ తప్పనిసరి, లేకపోతే డబుల్ ట్యాక్స్, జరిమానా చెల్లించాల్సిందే
- ఐఫోన్ 13 మొబైల్స్ ఐఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్నాయి. వీటిలో ఉండే ప్రాసెసర్ 4 నానో మీటర్ టెక్నాలజీతో అత్యంత వేగంగా పనిచేస్తుంది.
- ఐఫోన్ మొబైల్స్(iPhone Mobiles)లో కెమెరా మెగా పిక్సెల్స్ తక్కువగా ఉన్నా క్లారిటీ విషయంలో మాత్రం రాజీపడదు యాపిల్ సంస్థ. ప్రస్తుతం 1.8 అపెచ్యూర్తో రియర్ కెమెరా తీసుకురానుంది. వెనుక వైపు రెండు 13 మెగా పిక్సెల్ కెమెరాలు, ముందు కూడా 13 మెగా పిక్సెల్ కెమెరాను సెల్ఫీల కోసం అమర్చనుంది.
Also Read: Supreme Court: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సుప్రీంకోర్టు శుభవార్త
- ఐఫోన్ 13 వేరియంట్లలో స్టోరేజీ 1టీబీని అందుకోనుందని తెలుస్తోంది. అయితే నాలుగు వేరియంట్లలో అంత మొత్తంలో స్టోరేజీ ఇస్తుందా లేదా కొన్ని రోజుల్లో తేలనుంది.
- ప్రస్తుతం కేవలం ఒప్పో మొబైల్స్ మాత్రమే పెరీస్కోప్ లెన్స్ వినియోగిస్తుంది. ఇకమీదట ఐఫోన్ 13 మొబైల్స్ సైతం పెరీస్కోప్ లెన్స్‌తో రానున్నాయని ప్రచారంలో ఉంది.
- ఇందులో ఛార్జింగ్ కేబుల్ లేకుండా తీసుకొస్తున్నారు. మరోవైపు హెడ్ ఫోన్ సౌకర్యం ఉండదని సైతం యాపిల్ కంపెనీ తెలిపింది.
Also Read: BSNL Promotional Offer: ఈ రీఛార్జ్ ప్లాన్‌తో డబుల్ డేటా, మరిన్ని ప్రయోజనాలు
- ఐఫోన్ 13లో ఫేస్ ఐడీ(Face ID), ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను యాపిల్ అందించే ఛాన్స్ ఉంది. భారత్‌లో ఎప్పుడు మార్కెట్లోకి రానుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
లేటెస్ట్ ఐఫోన్లో ఓలియో ఫోబిక్ కోటింగ్ ద్వారా స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌ను అందిస్తోంది యాపిల్. ఓఎల్‌డీ రెటీనా డిస్ప్లే యొక్క డెన్సిటీ 450 పీపీఐ అందించనుంది.
ఐఫోన్ 12 సిరీస్‌లో అందించలేకపోయిన 120 హెర్ట్జ్ డిస్ప్లే ఐఫోన్ 13లోనైనా యాపిల్ కచ్చితంగా తీసుకొస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook