Samsung Galaxy M02 Smartphone: కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్స్ ఎన్నో రోజూ మార్కెట్లోకి లాంచ్ అవుతుండటంతో అందులో ఏది ఎంపిక చేసుకోవాలో అర్థంకాక స్మార్ట్‌ఫోన్ యూజర్స్ అయోమయానికి గురవుతున్నారు. కరోనా కారణంగా స్టూడెంట్స్ నుంచి ఎంప్లాయిస్ వరకు అందరూ ఆన్లైన్ మీదే ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో అందరి అవసరాలు తీర్చే స్మార్ట్‌ఫోన్స్ వినియోగం కూడా అంతే స్థాయిలో పెరిగిపోయింది. బిగ్ స్క్రీన్, ఆగకుండా పనిచేసుకునేలా ఎక్కువసేపు బ్యాటరీ ఇచ్చే ఫీచర్స్ కొత్తగా మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్స్‌కి తప్పనిసరి అవసరాలు అయ్యాయి. సరిగ్గా అలాంటి స్మార్ట్ ఫోన్ గురించే ఇప్పుడు మేము మీకు వివరించబోతున్నాం అంటే నమ్ముతారా ? ఇదిగో డీటేల్స్..
The Mega Entertainer- తిరుగులేని ఎంటర్టైన్మెంట్:
తక్కువ ధరలోనే ఎంతో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందించే స్మార్ట్ ఫోన్ ఇది. 2020లో లాంచ్ అయిన Galaxy M01 కి కొనసాగింపుగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్.. 6.5 ఇంచుల HD+ Infinity-V డిస్ప్లే, 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 5000mAh battery తో మీకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మీరు ప్రయాణంలో ఉన్నా లేక సరదాగా మనసుకు ఉల్లాసం కలిగించే వీడియోలు చూడాలనుకున్నా.. శాంసంగ్ M02 స్మార్ట్ ఫోన్ మిమ్ములను ఏ మాత్రం నిరాశపర్చదు.
Capturing Moments - అందమైన ఫోటోలు, వీడియోలు, సెల్ఫీల కోసం..
13MP ప్రైమరీ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్ షూటర్ టెక్నాలజీతో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉన్న ఈ శాంసంగ్ గెలాక్సీ M02 స్మార్ట్ ఫోన్‌తో తక్కువ వెలుతురులోనూ ఎంతో అందంగా వచ్చేలా ఫోటోలు, వీడియోలు తీయవచ్చు. సోషల్ మీడియాలో స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎంతో యాక్టివ్‌గా ఉన్న నేటి రోజుల్లో సెల్ఫీలకు ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే సెల్ఫీలు, వీడియో కాల్స్ అవసరాలకు అనుగుణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌కి ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. వీటీతో సెల్ఫీలను సైతం ఎంజాయ్ చేయొచ్చు.
Other Discerning Features - మరెన్నో ఆకట్టుకునే ఫీచర్స్..
నానో డ్యూయల్ సిమ్ టెక్నాలజీ కలిగిన ఈ Samsung Galaxy M02 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేస్తుంది. దీని పవర్ఫుల్ ప్రాసెసర్‌తో సూపర్ స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎంజాయ్ చేయొచ్చు. బ్లాక్, గ్రే, రెడ్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్స్‌లో చేతిలోనూ ఇమిడిపోయేలా ఉంటుంది.
32GB స్టోరేజ్, క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6739 SoC ప్రాసెసర్, 3GB RAM ఈ స్మార్ట్‌ఫోన్‌కి ఉన్న ఇతర ప్రత్యేకతలు. MicroSD card స్లాట్ ద్వారా 1TB వరకు మెమొరీ స్టోరేజ్ పెంచుకునేలా ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఎక్స్‌పాండబుల్ ఆప్షన్. 4G LTE, Wi-Fi, Bluetooth, GPS తో కనెక్టివిటీ ఆప్షన్స్ అందిస్తోంది శాంసంగ్ గెలాక్సీ M02.
Value for Money - పెట్టిన డబ్బులకు సంతృప్తినిచ్చే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
కేవలం రూ. 6999 లకే ఇప్పుడు చెప్పుకున్న అన్ని ఫీచర్స్‌తో పాటు 2GB + 32GB వేరియంట్‌తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. ఇక 3GB + 32GB రకం స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,499 లకే లభిస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచే ఈ స్మార్ట్ ఫోన్ Amazon.in , శాంసంగ్ అధికారిక వెబ్సైట్ Samsung.com , Samsung e-store తో పాటు అన్ని పెద్దపెద్ద రీటేలర్ దుకాణాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది.
బిగ్ స్క్రీన్, ఎక్కువ నిడివి పవర్ స్టోరేజ్ ఇచ్చే 5000mAh battery కారణంగా ఇంటికి దూరంగా ఉండి పనిచేసే సమయాల్లో, వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు, Online classes అటెండ్ అవడానికి, సినిమాలు చూడటానికి ఎటువంటి అంతరాయం లేకుండా ఈ Smartphone ఎక్స్‌పీరియెన్స్ ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కావడంతో కామన్ మ్యాన్‌కి సైతం అందుబాటులో ఉండే హైఎండ్ స్మార్ట్ ఫోన్ ఇది. Samsung ఇండియాలోకి అడుగుపెట్టి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సంవత్సరంలోనే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇండియాను డిజిటల్ ఇండియాగా మార్చేందుకు కృషిచేస్తోన్న Samsung లాంటి పెద్ద బ్రాండ్ ప్రవేశపెట్టిన ఫోన్ కావడంతో ఇక ధర, క్వాలిటీ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook