అదిరిపోయే ఆఫర్లతో రూ. 7వేల లోపే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M02: 5000mAh బ్యాటరీ + 6.5 అంగుళాల డిస్‌ప్లే + డ్యూయల్ రియర్ కెమెరా + సెల్ఫీ కెమెరా

Samsung Galaxy M02 price, specifications and offers: సామాన్యుల బడ్జెట్‌లోనూ అందుబాటులో ఉండేలా కేవలం రూ. 7 వేలలోపు ధరతో శాంసంగ్ అందిస్తోంది సరికొత్త Galaxy M02 smartphone. ఇండియాను డిజిటల్ ఇండియాగా మార్చడంలో ఆశించినదానికంటే ఎక్కువే కృషిచేస్తోన్న శాంసంగ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో ఆకట్టుకునే Features ఉన్నాయి.

Last Updated : Feb 18, 2021, 04:18 PM IST
  • శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M02 .
  • శాంసంగ్ గెలాక్సీ M02 ధర, ఫీచర్స్, ఆఫర్స్ వివరాలు.
  • ఆన్‌లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్, గేమింగ్, ఎంటర్‌టైన్మెంట్.. అన్ని అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్
అదిరిపోయే ఆఫర్లతో రూ. 7వేల లోపే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M02: 5000mAh బ్యాటరీ + 6.5 అంగుళాల డిస్‌ప్లే + డ్యూయల్ రియర్ కెమెరా + సెల్ఫీ కెమెరా

Samsung Galaxy M02 price, specifications and offers: సామాన్యుల బడ్జెట్‌లోనూ అందుబాటులో ఉండేలా కేవలం రూ. 7 వేలలోపు ధరతో శాంసంగ్ అందిస్తోంది సరికొత్త Galaxy M02 smartphone. ఇండియాను డిజిటల్ ఇండియాగా మార్చడంలో ఆశించినదానికంటే ఎక్కువే కృషిచేస్తోన్న శాంసంగ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో ఆకట్టుకునే Features ఉన్నాయి. అన్‌లిమిటెడ్ ఫన్ ఎంజాయ్ చేసేలా 5000mAh బ్యాటరీ, 6.5 అంగుళాల బిగ్ HD+ Infinity-V display, మీ ఆనందభరితమైన క్షణాల్ని అంతే అందంగా బంధించేలా డ్యూయల్ రీయర్ కెమెరా, Selfie camera లాంటి ఫీచర్స్ శాంసంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్‌ని మిగతా వాటికంటే ప్రత్యేకం చేశాయి. 

Samsung Galaxy M02 స్మార్ట్‌ఫోన్ 7 రూపాయలకే ఎందుకు బెస్ట్ ఫోన్ అంటే...
ఎప్పటికప్పుడు తమని తాము అప్‌డేట్ చేసుకుంటూ.. ఫోటోలు, వీడియోలు, సినిమాలు, సెల్ఫీలతో స్మార్ట్‌ఫోన్‌పై మునివేళ్లతో అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తోన్న నేటి తరం స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కి ఇది బెస్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు. కేవలం వినోదం అనే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి, ఆన్‌లైన్ క్లాసెస్‌కి హాజరవడానికి ఎక్కువసేపు బ్యాటరీ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. అటువంటి స్మార్ట్‌ఫోనే ఈ శాంసంగ్ గెలాక్సీ M02. 

ప్రస్తుత వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే శాంసంగ్ ఇలా 5000mAh బ్యాటరీ, 6.5 అంగుళాల బిగ్ HD+ Infinity-V display, డ్యూయల్ రీయర్ కెమెరా లాంటి ఫీచర్స్‌తో ఈ Samsung Galaxy M02 స్మార్ట్‌ఫోన్‌ని రూపొందించింది. ఎప్పటికప్పుడు అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అతి తక్కువ ధరలోనే అందరి అవసరాలకు మ్యాచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాంసంగ్ ఎప్పటి నుంచో కృషి చేస్తోంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రారాజులా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అందుకే అందరికీ నచ్చే స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్స్‌లో శాంసంగ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. 

Samsung-Galaxy-M02-Samsung-offering-Galaxy-M02-under-7000-Rupees

Display - 16.55 సెంటీ మీటర్లతో ఇనిఫినిటీ-వి HD డిస్‌ప్లే కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ సినిమాలు చూడటానికి, గేమింగ్‌కి ఎంతో చక్కటి అనుభూతిని అందిస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్‌కి అమర్చిన హెచ్‌డి డిస్‌ప్లే టెక్నాలజీ ఎంటర్‌టైన్మెంట్ చూసేందుకు, ఆన్‌లైన్ క్లాసెస్‌కి అటెండ్ అవడానికి, వీడియో కాల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే కరోనా లాక్‌‌డౌన్ తర్వాత మనం ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులకు, ప్రస్తుత అవసరాలకు అనువైన స్మార్ట్‌ఫోన్ అన్నమాట.

Also read : Samsung Galaxy A72 Price In India: శాంసంగ్ ఏ72 ధర, ఫీచర్స్, Samsung Galaxy A72 Specifications

Camera –  13MP ప్రైమరీ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్ టెక్నాలజీతో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉన్న ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం02 స్మార్ట్ ఫోన్‌తో తక్కువ వెలుతురులోనూ మరింత అందంగా వచ్చేలా ఫోటోలు, వీడియోలు తీయవచ్చు. 2MP macro camera సహాయంతో అందమైన close-up shots తీసుకోవచ్చు. ఇక నేటి జమానాలో సెల్ఫీలకు ఉండే ప్రత్యేకత ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అసలే లేదు. అందుకే సెల్ఫీలు, వీడియో కాల్స్ అవసరాలకు అనుగుణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌కి ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

Samsung Galaxy M02 price, specifications and offers

Battery - స్మార్ట్ ఫోన్ అంటేనే మ్యూజిక్, మూవీస్, గేమింగ్ వంటి అన్‌‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ అందుకు అనుగుణంగా బ్యాటరీ సపోర్ట్ చేయకపోతే ఆ ఆనందాన్ని కోల్పోతాం. కానీ ఈ స్మార్ట్‌ఫోన్‌తో ఆ బెంగ లేదు. ఎందుకంటే ఈ ఫోన్ 5000mah బ్యాటరీ సహాయంతో నడుస్తుంది.

Performance – ఏ స్మార్ట్ ఫోన్‌కి అయినా ఇప్పటివరకు చెప్పుకున్న గొప్ప గొప్ప ఫీచర్స్ ఎన్ని ఉన్నా.. వాటికి అనుగుణంగా RAM లేకపోతే.. ఆ ఫోన్ సరిగ్గా పర్‌ఫామ్ చేయలేదు. అది దృష్టిలో పెట్టుకునే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3GB RAM, MediaTek 6739 ప్రాసెసర్‌ని అమర్చారు. 

Design & Colour Options – మీకు ఇష్టం వచ్చిన రంగుల్లో మీ స్మార్ట్‌ఫోన్‌ని ఎంచుకునేలా Samsung Galaxy M02 బ్లాక్, రెడ్, గ్రే, బ్లూ కలర్లలో ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ లభ్యమవుతోంది. అంతేకాకుండా Haze, Matt డిజైన్స్‌లోనూ ఈ స్మార్ట్ ఫోన్‌ని ఎంచుకోవచ్చు. 

Samsung Galaxy M02 - Samsung offering Galaxy M02 under 7K; Specifications of Samsung Galaxy M02

Value for Money – పెట్టిన డబ్బుకు తగిన విలువ
ఇప్పుడు చెప్పుకున్న ఫీచర్స్ అన్నీ కేవలం రూ. 6999 లకే 2GB + 32GB వేరియంట్‌తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. ఇక 3GB + 32GB రకం స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,499 లకే లభిస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచే ఈ స్మార్ట్ ఫోన్ Amazon.in , శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ Samsung.com , Samsung e-store తో పాటు అన్ని పెద్దపెద్ద రీటేలర్ దుకాణాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. Amazon.in , Samsung.com వెబ్‌సైట్స్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ. 200 డిస్కౌంట్‌తో పరిమిత కాలపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ  స్మార్ట్‌ఫోన్ సరికొత్తగా మార్కెట్‌లోకి వచ్చినందున ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 2GB+32GB మెమొరీ స్టోరేజీ కలిగిన వేరియంట్ కేవలం రూ. 6,799 లకే లభ్యం అవుతుందన్నమాట. అయితే అది పరిమిత కాలం మాత్రమే... ఇంకెందుకు ఆలస్యం మరి... ఈ Samsung smartphone కోసం త్వరపడండి.. 

Samsung Galaxy M02 స్పెసిఫికేషన్స్

 డిస్‌ప్లే  6.5 ఇంచుల HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లే
 బ్యాటరీ  5000mAh
 కెమెరా  13MP + 2MP కలిగిన డ్యూయల్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా
ప్రాసెసర్  మీడియాటెక్ 6739
కలర్స్  రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే
మెమొరీ స్టోరేజ్   2GB + 32GB వేరియంట్, 3GB + 32GB వేరియంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News