KGF Chapter 2 : మరో లేటెస్ట్ అప్‌డేట్‌తో అంచనాల్ని పెంచుకుంటున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2

KGF Chapter 2 : పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2 పై అంచనాలు ఎక్కువవుతున్నాయి. మూవీకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది చిత్ర యూనిట్. ఇప్పుడు మరో అప్‌డేట్ అభిమానుల కోసం సిద్ధంగా ఉంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2021, 01:15 PM IST
KGF Chapter 2 : మరో లేటెస్ట్ అప్‌డేట్‌తో అంచనాల్ని పెంచుకుంటున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2

KGF Chapter 2 : పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2 పై అంచనాలు ఎక్కువవుతున్నాయి. మూవీకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది చిత్ర యూనిట్. ఇప్పుడు మరో అప్‌డేట్ అభిమానుల కోసం సిద్ధంగా ఉంది.

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashant Neel) దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 (KGF Chapter 1) సూపర్ డూపర్ హిట్‌తో సంచలనమైన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు సీక్వెల్‌గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కుతోంది. కన్నడ సూపర్ యాక్షన్ స్టార్ యాష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ నిధి హీరోయిన్‌గా కన్పించనుంది. రాకీ పాత్రలో యాష్(Yash) ఉర్రూతలూగించాడు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి అభిమానుల్లో క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా సంజయ్ దత్ (Sanjay Dutt) నటిస్తున్నాడు. 

సినిమా అంచనాల్ని మరింతగా పెంచేందుకు అప్పుడప్పుడూ మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్‌ను వదులుతోంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా కేజీఎఫ్ టైమ్స్ పేరిట కేజీఎప్ ఛాప్టర్ 2లో(KGF Chapter 2) ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రిలీజవుతున్నాయి. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రగా ఉన్న ఇనాయత్ ఖలీల్‌కు సంబంధించి అప్‌డేట్ విడుదలైంది. ఇనాయత్ ఖలీల్..అతిపెద్ద సామ్రాజ్యమైన నానాచిని  ఆక్రమించేందుకు ఎవరితో చేతులు కలుపుతాడనే ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాకుండా అతడు తన బర్త్‌డేని ఇండియాలో ఓ రహస్య ప్రాంతంలో జరుపుకుంటున్నాడంటూ లీక్ చేశారు. ఇలాంటి ఆసక్తికరమైన ఆంశాలతో సినిమాపై అంచనాల్ని మరింత పెంచేస్తున్నారు. అందుకే కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ కోసం అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. 

Also read: Actor Sonu Sood: ఏపీ, తెలంగాణ ప్రజలకు నటుడు సోనూ సూద్ మరో సాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News