G-7 Summit: ప్రతిష్ఠాత్మక జీ 7 దేశాల సదస్సు ముగిసింది. మూడ్రోజులపాటు బ్రిటన్ వేదికగా జరిగిన సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాలుష్యానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకొచ్చాయి.
అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ - 7 ప్రతిష్ఠాత్మక సదస్సు (G-7Summit) బ్రిటన్ వేదికగా జరిగింది. మూడ్రోజులపాటు జరిగిన సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కూటమిలో కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాలున్నాయి. ప్రపంచానికి వ్యాక్సిన్ (Vaccine) అందించడంలో సాయం చేయాలని సభ్య దేశాలు తీర్మానించాయి. రోజురోజుకీ పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని సాంకేతికత సహాయంతో ఎదుర్కొంటామని వెల్లడించాయి. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువగా జరుగుతుందని..మానవ హక్కుల్ని గౌరవించాలని జీ-7 దేశాల సదస్సు వేదికగా పిలుపునిచ్చాయి. జీవ వైవిద్య నష్టాన్ని తగ్గించేందుకు నేచర్ కాంపాక్ట్ 2010 (Nature Compact 2010)కు సంబంధించి 2030 నాటికి ఉద్ఘారాల్ని దాదాపు సగానికి తగ్గిచేందుకు కృష్టి చేయాలని తీర్మానించాయి.
బొగ్గును ఎనర్జీ కోసం మాత్రమే వినియోగించేలా తప్పనిసరి చేయడం, పెట్రోల్, డీజిల్ కార్లను దశలవారీగా తొలగించడం వంటివి ఈ సదస్సులో కీలకంగా ఉన్నాయి. జీ-7 దేశాల కూటమి సదస్సుకు ఆస్ట్రేలియా, కొరియా రిపబ్లిక్, దక్షిణాఫ్రికా, ఇండియా దేశాల్ని కూడా బ్రిటన్ (Britain) ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలతో భావసారూప్యత కలిగిన దేశాల్ని కలిపి ఉంచేందుకు ఈ దేశాలకు ఆహ్వానం పంపారు.
Also read: Check to China: చైనా ఆధిపత్యానికి చెక్, జీ 7 దేశాల్లో మిశ్రమ స్పందన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook