IND Vs PAK T20 WC Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా.. భారత్-పాక్ జట్ల మధ్య ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ పోరు నేపథ్యంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్(Union Minister Giriraj Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా భారత్-పాక్ మ్యాచ్(India-Pakistan cricket match)ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు సరిగా లేనందున దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
Also read: Ranjit Singh murder case: హత్యకేసులో డేరా బాబాకు జీవిత ఖైదు..మరో నలుగురికి కూడా..!
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు(Terrorists) కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దాయాదుల పోరు జరగడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే ఆస్కారముందని ఆయన అభిప్రాయపడ్డాడు. కాగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం ముష్కరులు కాల్పులకు తెగబడి ఇద్దరిని పొట్టనబెట్టుకున్నారు. ఈ నెలలో ఇప్పటి దాకా ఉగ్రదాడులకు 11 మంది బలయ్యారు. ఈ నేపథ్యంలోనే పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్‌పై పునరాలోచించండి: కేంద్ర మంత్రి