ప్రియా వారియర్‌లా అల్లుఅర్జున్ పేరడీ..వీడియో వైరల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, 'ఒరు అదార్ లవ్' ఫేం ప్రియా ప్రకాశ్ వారియర్ కు ఫిదా అయ్యారు.

Last Updated : Feb 24, 2018, 04:43 PM IST
ప్రియా వారియర్‌లా అల్లుఅర్జున్ పేరడీ..వీడియో వైరల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, 'ఒరు అదార్ లవ్' ఫేం ప్రియా ప్రకాశ్ వారియర్ కు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె కళ్లతో పలికించిన హావభావాలు బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే..! తాజాగా అల్లుఅర్జున్ కూడా ఆ పాటలో ప్రియా వారియర్ చేసినట్లే చేసి అలరించాడు. తన కుమారుడు అయాన్‌తో కలిసి ఈ పేరడీని చేశాడు. తన చూపుడు వేలు మధ్య వేలుకు ముద్దుపెట్టిన బన్నీ, తన కుమారుడికి దాన్ని గురిపెట్టి షూట్ చేశాడు.

బ‌న్ని అలా షూట్ చేయ‌డంతో అయాన్ బెడ్‌పై కేకలు వేస్తూ పడిపోయాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 'ఒరు అదార్ లవ్' హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు. కొన్ని రోజుల క్రితం ప్రియా వారియ‌ర్ ను బన్నీ మెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెను అనుక‌రిస్తూ బన్నీ ఇలా చేయ‌డం అభిమానుల‌ను అల‌రిస్తోంది.

 

#oruadaarlove

A post shared by Sneha (@allusnehareddy) on

 

బన్నీ.. ప్రస్తుతం 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వక్కవంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Trending News