పాలము: జార్ఖండ్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. పాలము జిల్లాలో భద్రతాదళాలకు, నక్సల్స్ లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్లు గుర్తించారు. సీఆర్పీఎఫ్ 134 బెటాలియన్ బృందాలు స్పెషల్ కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సలైట్లు భద్రతాదళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా వారిపై ప్రతిదాడికి దిగారని తెలిపారు.
గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఇదే నెల ఫిబ్రవరి 18న ఛత్తీస్ఘడ్ లోని సుక్మా జిలాల్లో జరిగిన ఎన్కౌంటర్ లో భద్రతాబలగాలు 20 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు.