Sports vs Cinema: యాక్టర్స్, మోడల్స్‌గా మారిన క్రీడాకారుల పిల్లలు..సారా టెండూల్కర్ నుంచి దీపికా వరకూ

ఏ రంగంలో అయినా సెలెబ్రిటీలుగా ఉన్నవాళ్లకు..పిల్లలు కూడా అలాగే అదే రంగంలో రాణించాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడూ అలా జరగదు. తల్లిదండ్రుల వృత్తికి భిన్నంగా ఆ పిల్లలు మరో వృత్తిలో రాణిస్తుంటారు. ముఖ్యంగా క్రీడల్లో సెలెబ్రిటీలుగా ఉన్న కొద్దిమంది ప్రముఖుల పిల్లలు యాక్టర్స్ లేదా మోడల్స్‌గా రాణిస్తున్నారు. ఆ ఫోటోలు మీ కోసం..

Sports vs Cinema: ఏ రంగంలో అయినా సెలెబ్రిటీలుగా ఉన్నవాళ్లకు..పిల్లలు కూడా అలాగే అదే రంగంలో రాణించాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడూ అలా జరగదు. తల్లిదండ్రుల వృత్తికి భిన్నంగా ఆ పిల్లలు మరో వృత్తిలో రాణిస్తుంటారు. ముఖ్యంగా క్రీడల్లో సెలెబ్రిటీలుగా ఉన్న కొద్దిమంది ప్రముఖుల పిల్లలు యాక్టర్స్ లేదా మోడల్స్‌గా రాణిస్తున్నారు. ఆ ఫోటోలు మీ కోసం..

1 /4

ఈమె పేరు సోహా అలీ ఖాన్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సోదరి, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ తనయ. హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లో నటిస్తోంది.

2 /4

సైఫ్ అలీ ఖాన్. బాలీవుడ్ సూపర్ స్టార్‌లలో ఒకడు ఇండియాలో ఒకప్పటి ప్రముఖ క్రికెటర్, మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కుమారుడు. 21 ఏళ్లకే ఇండియన్ టీమ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

3 /4

ఈమె దీపికా పదుకోన్. బాలీవుడ్‌ను ఏలుతున్న రారాణిగా చెప్పుకోవచ్చు. ఈమె ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన ప్రకాష్ పదుకోన్ తనయ. ప్రకాష్ పదుకోన్ 1980లలో వరల్డ్ నెంబర్ 1 గా ఉన్నాడు. 

4 /4

ఈమె పేరు సారా టెండూల్కర్. పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ. ఇటీవల మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చిన సారా టెండూల్కర్ సంచలనం రేపుతోంది.