Omicron variant updates 8 new Omicron cases in Maharashtra take India's count to 109 : ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్‌లో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 109 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో (Maharashtra) కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం అక్కడ మరో ఎనిమిది మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా (Omicron Positive) తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 48కి చేరింది.
ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (new variant Omicron) విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ ఎంతో స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతోంది. ఇప్పటికే 91 దేశాలకు ఈ వేరియంట్ (Variant) పాకింది. ఇక ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది. వీలైంత వరకు ప్రయాణాలను వాయిదా వేయాలని సూచించింది. పండగలు, న్యూ ఇయర్ (New Year) వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని కోరింది.
Also Read : flipkart Big Saving Days: భలే మంచి చౌక భేరం.. కిలో టమాటాల కంటే చీప్ గా స్మార్ట్ ఫోన్స్ అమ్మకం..
ఇక దేశంలోని 19 జిల్లాల్లో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ రేటు ఒక వారంలో ఐదు నుంచి 10 శాతం మధ్య ఉంది. కోవిడ్ వ్యాక్సినేషన్‌లో (Covid vaccination) భారత్ మిగతా దేశాలతో పోల్చితే ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా 136 కోట్ల వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బ్రిటన్‌తో పోలిస్తే 12.5 రెట్లు అధిక వ్యాక్సినేషన్ (Vaccination) రేట్ మనదేశంలో ఉందని పేర్కొంది.
Also Read : Millipede: ప్రపంచంలోనే అత్యధిక కాళ్లు కలిగిన జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Omicron Case: భారత్‌లో ఒమిక్రాన్ విజృంభన, 109 కి చేరిన కేసులు..జాగ్రత్త అంటోన్న కేంద్రం
భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్
మొత్తం 109 కేసులు నమోదు
అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు