Jagananna Chododu scheme: నేడు 'జగనన్న చేదోడు' నిధులు విడుదల.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.10వేలు వేయనున్న సీఎం జగన్..

Jagananna Chododu scheme: జగనన్న చేదోడు పథకం కింద రెండో విడత నగదు లబ్దిదారుల ఖాతాల్లో మంగళవారం జమ కానుంది. వీరికి ఈ పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 02:53 PM IST
  • ఇవాళ జగనన్న చేదోడు నిధుల విడుదల
  • ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమచేయనున్న సర్కారు
Jagananna Chododu scheme: నేడు 'జగనన్న చేదోడు' నిధులు విడుదల.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.10వేలు వేయనున్న సీఎం జగన్..

Jagananna Chododu Scheme: ఇవాళ 'జగనన్న చేదోడు' పథకం నిధులను (Jagananna Chododu scheme) ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకం కింద దుకాణాలు ఉన్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం జగన్‌ (CM Jagan) జమ చేయనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,85,350 మందికి రూ.285.35 కోట్లు జమ చేయనున్నారు. ఇందులో దర్జీలు 1,46,103 మంది, రజకులు 98,439 మంది, నాయీబ్రాహ్మణులు 40,808 మంది ఉన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని జమ చేస్తారు. వరుసగా రెండో ఏడాది ఈ సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పథకం కింద ఇప్పటివరుకు రూ.583.78 కోట్లు అందించినట్లు జగన్ సర్కారు తెలిపింది. 

ఇందులో భాగంగా 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, 98వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. కుల వృత్తులకు సంబంధించి షాపులు ఉండి సరైన అర్హతలుంటే ఈ పథకం వర్తిస్తుంది. అయితే అర్హత గలవారు వాలంటీర్ల ద్వారా నేరుగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: Nellore Police: మహిళా పోలీసుల యూనిఫాం కొలతలకు జెంట్స్‌ టైలర్‌.. నెల్లూరు పోలీసుల తీరుపై విమర్శలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News