Lemongrass: లెమన్ గ్రాస్ ప్రయోజనాలు, స్కిన్ అండ్ హెయిర్ కేర్‌లో ఎలా ఉపయోగపడుతుంది

Lemongrass: దేశంలో సర్వ సాధారణంగా లభించే మొక్కల్లో లెమన్ గ్రాస్ అతి ముఖ్యమైంది. వివిధ రకాల బ్యూటీ అప్లికేషన్లలో విరివిగా ఉపయోగించే లెమన్ గ్రాస్‌తో కలిగే పూర్తి ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 11, 2022, 09:38 AM IST
Lemongrass: లెమన్ గ్రాస్ ప్రయోజనాలు, స్కిన్ అండ్ హెయిర్ కేర్‌లో ఎలా ఉపయోగపడుతుంది

Lemongrass: దేశంలో సర్వ సాధారణంగా లభించే మొక్కల్లో లెమన్ గ్రాస్ అతి ముఖ్యమైంది. వివిధ రకాల బ్యూటీ అప్లికేషన్లలో విరివిగా ఉపయోగించే లెమన్ గ్రాస్‌తో కలిగే పూర్తి ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం.

లెమన్ గ్రాస్ అనేది ఓ ట్రాపికల్ ప్లాంట్. ఇండియాలో విరివిగా లభిస్తుంది. సిట్రస్ ఫ్యామిలీకు చెందిన లెమన్ గ్రాస్ ఆయిల్‌ను వివిధ రకాల బ్యూటీ అప్లికేషన్లలో ఉపయోగిస్తుంటారు. చర్మాన్ని శుభ్రపర్చడం, బాడీ మస్సాజ్, ఒత్తిడి తగ్గించేందుకు చాలాకాలంగా లెమన్ గ్రాస్ ఆయిల్ ఉపయోగిస్తూ వస్తున్నాం. చర్మ సంరక్షణ, సౌందర్యానికి ఆర్గానిక్ లెమన్ గ్రాస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే అద్భుతమైన ప్రయోజనాల్లో ముఖ్యమైంది ఆయిల్ స్కిన్ ట్రీట్‌మెంట్. బాడీకు కావల్సిన ఆయిల్‌ని నియంత్రిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అందుకే స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో లెమన్ గ్రాస్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్‌లో ఉండే ప్యూరిఫైయింగ్ గుణం కారణంగా చర్మ సంరక్షణకు చాలా మంచిది. చర్మంలో ఉండే విషతుల్య పదార్ధాల్ని తొలగించడం, క్లీన్ అండ్ ఫ్రెష్‌గా ఉంచడంలో దోహదపడుతుంది. దీనికోసం లెమన్ గ్రాస్‌ను ఉడకబెట్టి ఆ నీటిని వినియోగించాల్సి ఉంటుంది.

ఇక మరో ప్రధాన సమస్య చుండ్రు. చుండ్రు కారణంగా స్కాల్ప్ ఇరిటేషన్ వస్తుంటుంది. జుట్టు ధృడంగా రాలకుండా ఉండాలంటే స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండాలి. 2-3 చుక్కల లెమన్ గ్రాస్ ఆయిల్‌ను సాధారణ తలనూనెకు కలిపి రాసి..బాగా మస్సాజ్ చేసుకోవాలి. ఫలితంగా చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియా నాశనమవుతుంది. లెమన్ గ్రాస్ అనేది యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్‌లో పెద్దమొత్తంలో యాంటీ ఫంగల్ గుణాలున్నాయి. ఇది శరీరంలో ఫంగస్ వ్యాపించకుండా అరికడుతుంది. మరీ ముఖ్యంగా చర్మం, గోర్లు, తలపై పెరిగే క్యాండిడాను లెమన్ గ్రాస్ అరికడుతుంది. 

ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం యాక్నే ఫైటింగ్ గుణాలు. ముఖంపై మొటిమల్ని అరికడుతుంది. లెమన్ గ్రాస్‌లో(Lemon grass) ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా మొటిమల్ని కచ్చితంగా అరికట్టవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకే లెమన్ గ్రాస్ అనేది సాధారణంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్‌గా ఉపయోగపడుతుంది. 

Also read: Coffee Side Effects: ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News