Horoscope Today March 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి!!

Daily Horoscope March 4 2022: ఈరోజు మిథునం, తుల రాశుల వారి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈ రెండు రాశుల వారికి ప్రేమ విషయంలో ఓ శుభవార్త అందనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 06:44 AM IST
  • March 4 2022 రాశి ఫలాలు
  • ఆ రాశుల వారి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
Horoscope Today March 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి!!

Horoscope Today March 4 2022: మేషం ( Aries): ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ వెంకటేశ్వర దర్శనం శుభప్రదం.

వృషభం (Taurus): శ్రద్ధతో పనిచేస్తే విజయాలు అందుతాయి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయొద్దు. కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో ఆటంకాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం.

మిథునం (Gemini): మంచి కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమవ్యవహారాలు చక్కబడతాయి. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభాన్ని చేకూరుస్తుంది.

కర్కాటకం (Cancer): నూతన పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

సింహం (Leo): సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. మీ మనస్సుకు నచ్చిన వారితో మరువలేని క్షణాలను గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం చదవాలి.

కన్య (Virgo): మనసు పెట్టి పనిచేస్తే విజయం దక్కుతుంది. స్నేహితుల సహకారంతో మేలు జరుగుతుంది. మీ పనిలో శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

తుల (Libra): మంచి కాలం నడుస్తోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబంతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు శుభవార్త అందనుంది. గురుశ్లోకం చదవడం మంచిది.

వృశ్చికం (Scorpio): నూతన పనుల్లో పట్టుదల వదలకండి. ఉన్నత అధికారులతో జాగ్రత్తగా ఉండండి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

ధనస్సు (Sagittarius): అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం చదవాలి.

మకరం (Capricorn): పనుల్లో ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్లండి. ఈ సమయాన్ని వృథా చేయకండి. పై అధికారులతో జాగ్రతగా ఉండాల్సిన సమయం. శత్రువులకు దూరంగా ఉండాలి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

కుంభం  (Aquarius): కష్టపడితే ఫలితాలు ఉన్నాయి. తోటివారి సహకారం ఉంది. సమయానికి విశ్రాంతి తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

మీనం (Pisces): ఆత్మబలంతో ముందుకు సాగితే విజయం దక్కుతుంది. ధనధాన్యాభివృద్ధి ఉంది. ఇతరుల జోలికి వెళ్లకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విష్ణుసహస్రనామ స్తోత్రం చదివితే మంచిది.

Also Read: Mahindra university: ఇండియాలో మెడికల్ కాలేజీల కొరతపై ఆనంద్ మహీంద్రా ట్వీట్​

Also Read: Putin Wax Statue: ఆ మ్యూజియంలో పుతిన్ మైనపు విగ్రహం తొలగింపు- జెలన్​స్కీకి చోటు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News