Ravindra Jadeja: 35 ఏళ్ల కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా..!!

Ravindra Jadeja Breaks Kapil Dev Record. రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా జడేజా నిలిచాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 04:12 PM IST
  • భారత్‌, శ్రీలంక తొలి టెస్ట్‌
  • సెంచరీ చేసిన జడేజా
  • కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా
Ravindra Jadeja: 35 ఏళ్ల కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా..!!

Ravindra Jadeja Breaks Kapil Dev Record: మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భారీ సెంచరీతో అదరగొట్టాడు. 228 బంతులు ఆడి 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జడ్డు తన ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. మొదటి రోజు మూడవ సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా.. రెండో రోజు రెండో సెషన్‌ వరకు ఆడాడు. ఈ క్రమంలో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. 

మొహాలీ మ్యాచులో 175 పరుగులు చేయడంతో రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా జడేజా నిలిచాడు. అంతకుముందు భారత మాజీ కెప్టెన్  కపిల్‌ దేవ్‌పై ఈ రికార్డు ఉంది. 1986లో శ్రీలంకపై 7వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి,న కపిల్ 163 పరుగులు చేశారు. ఈరోజు 175 పరుగులు చేసిన జడ్డు.. 35 ఏళ్ల తర్వాత కపిల్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ 159 పరుగులతో మూడో స్ధానంలో ఉన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 574/8 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో రోజు శనివారం భారత్‌ 357/6 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించగా.. మరో రెండు వికెట్లు కోల్పోయి 217 పరుగులు జోడించింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (61; 82 బంతుల్లో 8×4)తో కలిసి ఏడో వికెట్‌కు రవీంద్ర జడేజా (175 నాటౌట్‌; 228 బంతుల్లో 17×4,3×6) 130 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆపై మహమ్మద్ షమీ (20; 34 బంతుల్లో 3x4) తో కలిసి 103 పరుగుల భాగస్వామ్యం కూడా నిర్మించాడు. అంతకుముందు రిషబ్ పంత్‌ (96; 97 బంతుల్లో 9×4,4×6), హనుమ విహారి (58; 128 బంతుల్లో 5×4) అర్ధ శతకాలు చేయడంతో భారత్ 500లకు పైగా స్కోర్ చేసింది. 23 టెస్టుల తర్వాత టీమిండియా 500 పైచిలుకు స్కోర్‌ చేసింది.

Also Read: Radhe Shyam Making Video: రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియో.. ఇండియాలోనే ఇటలీని చూపించేశారుగా!!

Also Read: Nimmala Rama Naidu: సైకిల్‌ యాత్ర చేస్తూ.. ప్రమాదవశాత్తు జారిపడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x