Amazon Fab Phones Fest: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఫ్యాబ్ఫోన్స్ ఫెస్ట్ సేల్‌ను ప్రారంభించింది. నేడే ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా వివిధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీగా డిస్కౌంట్ ఇస్తోంది. ప్రీమియం మోడళ్ల నుంచి బడ్జెట్ వేరియంట్ల వరకు భారీగా స్పెషల్ డిస్కౌంట్‌తో పాటు.. బ్యాంక్ ఆఫర్, స్పెషల్ డిస్కౌంట్ వంటివి ఇస్తోంది.
బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ఇస్తోంది అమెజాన్. రూ.12,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎం12ను రూ.500కన్నా తక్కువ ధరకే కొనేందుకు వీలు కల్పిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు..
నిజానికి శాంసంగ్ గెలాక్సీ ఎం12 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ..ప్రీమియం ఫీచర్లతో లభిస్తుంది.. 6.5 అంగుళాల డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 ఎంపీ మెయిన్ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఆఫర్ల విషయానికొస్తే..
శాంసంగ్ గెలాక్సీ ఎం12 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మార్కెట్ ధర రూ.12,999గా ఉంది. అయితే అమెజాన్ ఫ్యాబ్ఫోన్స్ ఫెస్ట్‌లో.. దీని ధరను రూ. 9,499కి తగ్గించింది అమెజాన్. అంటే ఫోన్ పై రూ.3,500 ఇస్తోంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్..
శాంసంగ్ గెలాక్సీ ఎం12 పై రూ.9 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ తగ్గింపును పొందొచ్చు. అయితే మీరు ఎక్స్ఛేంజ్ చేసే స్మార్ట్‌ఫోన్ అనేది మంచి కండీషన్లో ఉండి, ఫీచర్లు ఎక్కువగా ఉన్న మోడల్ అయితే.. గరిష్ఠ ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తుంది. అలా మీ స్మార్ట్‌ఫోన్‌కు గరిష్ఠ ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తే గనక.. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.499కే తగ్గుతుంది.
బ్యాంక్ ఆఫర్..
ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే.. తక్షణం పది శాతం వరకు డిస్కౌంట్ లభించే వీలుంది. ఈ ఆఫర్ అన్ని స్మార్ట్ఫోన్లకు వర్తిస్తుంది.
నోట్: ఈ ఆఫర్ వివరాలన్ని అమెజాన్ వెబ్సైట్ ప్రకారం చెప్పడం జరిగింది. మరిన్ని వివరాలకోసం అమెజాన్ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
Also read: Flipkart Mi Fan Festival: రూ.30 వేల విలువైన షియోమీ 11ఐ 5జీ ఫోన్ రూ.10 వేలకే!
Also read: Cheapest Recharge Plan: రూ.75 తో కాలింగ్, డేటా అది కూడా 30 రోజుల వరకు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook