Srikakulam Train Accident: శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం.. ఛైన్ లాగి మరీ ప్రాణాలు పోగొట్టుకున్న ప్రయాణీకులు

Train Accident: ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీ కొనడంతో ఐదుగురు ప్రయాణీకులు మరణించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2022, 10:58 AM IST
  • శ్రీకాకుళం జిల్లా జి సిగడాంలో ఘోర రైలు ప్రమాదం
  • ఛైన్ లాగి దిగే క్రమంలో దుర్ఘటన
  • విశాఖవైపు వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొని ఐదుగురు
Srikakulam Train Accident: శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం.. ఛైన్ లాగి మరీ ప్రాణాలు పోగొట్టుకున్న ప్రయాణీకులు

Train Accident: ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీ కొనడంతో ఐదుగురు ప్రయాణీకులు మరణించారు. 

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జి.సిగడాం మండలం బాతువా సమీపంలో రైలు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఛైన్ లాగి మరీ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ ఐదుగురు. విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణీకులు శ్రీకాకుళం సమీపంలో ఛైన్ లాగి..పక్క ట్రాక్ పై దిగారు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై విశాఖపట్నంవైపుకు వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను చూసుకోలేదు. ఆ ఐదుగురి మీద నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వెళ్లిపోయింది. అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

స్టాప్ లేకపోవడంతో చైన్ లాగి దిగే క్రమంలో ప్రయాణీకులు మరణించినట్టు రైల్వే అధికారులు కూడా స్పష్టం చేశారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు వెంటనే వైద్య సేవలందించాల్సిందిగా ఆదేశించారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. మృతుల్లో ఇద్దరు అసోం వాసులున్నట్టు తెలుస్తోంది. 

Also read: Minister Roja: సినిమా టు రాజకీయం.. రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా పనిచేసిన నటీనటులు వీరే! రోజా ప్రస్థానం ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News