KGF‌2 Advance Bookings Collection: కేజీఎఫ్‌2 అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు ఎంతంటే..!

KGF‌2 Advance Bookings Collection: కన్నడ రాకింగ్ స్టార్  యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కేజీఎఫ్‌ ఛాప్టర్‌2.  2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో హిరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 07:22 PM IST
  • కేజీఎఫ్‌2 అడ్వాన్స్ బుకింగ్స్
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరోగా యష్
  • అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 11.16కోట్లు
KGF‌2 Advance Bookings Collection: కేజీఎఫ్‌2 అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు ఎంతంటే..!

KGF‌2 Advance Bookings Collection: కన్నడ రాకింగ్ స్టార్  యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కేజీఎఫ్‌ ఛాప్టర్‌2.  2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో హిరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లతోపాటు ప్రకాష్‌రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగెస్ట్ ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి ఎడిట్ చేసిన ఈ మూవీకి భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని డబ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌పై ఈ సినిమా విడుదలైంది. భారత్‌లో 6వేలు, దక్షిణాదిలో 2600 థియేటర్లలో విడుదల చేశారు.
దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 సుదీర్ఘ కాలంపాటు వెయిట్ చేయించిన అనంతరం ఏప్రిల్ 14న విడుదలైంది. ఈ మూవీ ఏపీ, తెలంగాణ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50 కోట్లకు కొనుగోలు చేశారు. మూవీ శాటిలైట్ హక్కులు సైతం ప్రముఖ ఛానెల్ రూ.30కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.  

కేజీఎఫ్2 ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు:
నైజాం- Rs 25 crore
సీడెడ్- Rs 14.03 crore
ఉత్తరాంధ్ర: Rs 9.7 crores
ఈస్ట్ గోదావరి : EG: Rs 7.2 crores
పశ్చిమ గోదావరి : Rs 6 crores
గుంటూరు : Rs 7 crores
కృష్ణా : Rs 5.5 crore
నెల్లూరు : Rs 2.75 crores

ఇక కేజీఎఫ్‌2 తెలుగు వెర్షన్‌ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 11.16కోట్లు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. విజయ్ బీస్ట్ సినిమాతో పోలిస్తే ఈ మొత్తం రెండింతలుగా ఉంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపుతో ఈ మూవీ వసూళ్లు మెరుగ్గా ఉండనున్నాయి. బాహుబలి 2 సాధించిన వసూళ్లను రీచ్ అవుతుందా లేదా అనేది మంగళ, బుధ వారం వసూళ్లను బట్టి డిసైడ్ కానుంది.

Also Read: KGF Chapter 2 OTT Release Date: అభిమానులకు గుడ్ న్యూస్.. 'కేజీయఫ్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Also Read: RR vs GT: రాజస్తాన్‌తో గుజరాత్‌ ఢీ.. టేబుల్ టాపర్‌ను హార్దిక్ టీమ్ ఓడిస్తుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News