Yash KGF Chapter 2 : రాఖీ భాయ్ పిట్ట కథ.. యష్‌ ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్

కేజీఎఫ్‌ ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యష్‌... ఆ ఆనందంలో అభిమానులకూ భాగం పంచుకున్నాడు. తన పట్ల అంతా చూపిస్తున్న అభిమానానికి ధన్యుడయ్యానంటూ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 07:14 PM IST
  • వసూళ్ల సునామీ సృష్టిస్తున్న కేజీఎఫ్‌2
  • హీరో యశ్‌కు ప్యాన్‌ ఇండియా హీరోగా క్రేజ్
  • అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్పిన యశ్
Yash KGF Chapter 2 : రాఖీ భాయ్ పిట్ట కథ.. యష్‌ ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్

 Yash KGF Chapter 2 : రాఖీ భాయ్.. ఈ పేరు వింటేనే గుర్తొచ్చే పదం కేజీఎఫ్‌. కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా.. డైరెక్టర్‌గా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన మూవీ కేజీఎఫ్‌. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్‌2 ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటి నుంచి బాక్సాఫీస్‌ వద్ద కేజీఎఫ్‌ మూవీ బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 700కోట్ల వసూళ్లు సాధించింది. హిందీలో బాహుబలి కలెక్షన్‌ల రికార్డులను సైతం మించి వసూళ్లు సాధిస్తోందంటే... రాఖీ భాయ్‌గా యష్‌ కేజీఎఎఫ్‌ చిత్రంలో ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్యాన్ ఇండియా లెవల్లో యష్‌కు క్రేజ్ తీసుకొచ్చిన కేజీఎఫ్‌ బ్రాండ్‌ను నీల్ మరిన్ని సీక్వెల్స్‌తో మరింత ముందుకు తీసుకెళ్తాడనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.

కేజీఎఫ్‌ ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యష్‌... ఆ ఆనందంలో అభిమానులకూ భాగం పంచుకున్నాడు. తన పట్ల అంతా చూపిస్తున్న అభిమానానికి ధన్యుడయ్యానంటూ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిన్ని విడియో రిలీజ్ చేశాడు. ఆ విడియోలో ఓ పిట్ట కథ చెప్పి ఆకట్టుకున్నాడు.

"ఓ ఊళ్లో కరవు తాండవిస్తోంది. ఊరంతా ఒక్కచోట చేరి దేవుణ్ని ప్రార్థించాలని నిర్ణయించారు. అంతా వచ్చారు. ఒక చిన్నోడు మాత్రం గొడుగు తీసుకొచ్చాడు. కొందరు గేలి చేశారు. ఇంకొందరు అతి విశ్వాసం అన్నారు. కానీ నిజానికి అదేంటంటే.. విశ్వాసం. నేనూ ఆ చిన్న పిల్లాడి లాంటి వాణ్నే. నాకు ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే నమ్మకంతో జీవించా. అందుకు కేవలం థాంక్స్ అనే పదం చాలా చిన్నది. నిజంగా మీలో ప్రతి ఒక్కరికీ... నా పై కురిపిస్తున్న ఆదరాభిమానాలకు, ప్రేమానురాగాలకు.. నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. కేజీఎఫ్ చిత్ర బృందం తరఫున నేను ఒక్కటే చెప్పాలనుకున్నా. మేమంతా ఎంతో ఆనందంలో ఉన్నాం. మేం మీకు అద్భుతమైన సినిమా అందించాలనుకున్నాం. మీకు కావాల్సిన వినోదం అందిందనుకుంటున్నా. మీ హృదయమే నా ఆవాసం. ఇట్లు మీ... యశ్‌." అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు యష్.


 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

యష్‌ కేజీఎఫ్‌ చాప్టర్‌2 మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూళ్లు చేసే దిశగా దూసుకెళ్తోంది. ప్రశాంత్‌ నీల్‌కు కూడా ప్యాన్ ఇండియా లెవల్లో యమా క్రేజ్ తెచ్చిపెట్టింది కేజీఎఫ్‌. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హిరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రకాష్‌ రాజ్, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు.

Also Read : Acharya Pre Release Event: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్ట‌ర్‌?

Also Read :  Video: అర్జున్ టెండూల్కర్ అదిరిపోయే యార్కర్.. అతనికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్న నెటిజన్లు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News