Hike in Beer Prices: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్, పెరగనున్న బీరు ధరలు, ఒక్కొక్క బీర్ ఎంతంటే..??

Beer Prices: మందుబాబులకు ఇది బ్యాడ్‌న్యూస్. మండు వేసవిల్లో చల్లగా కిక్కిచ్చే బీర్ కొండెక్కనుంది. త్వరలో ఒక్కొక్క బీరుపై భారీగానే ధర పెరగనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2022, 12:16 PM IST
  • బీరు ప్రియులకు షాక్, పెరగనున్న ధరలు
  • బార్లీ, రవాణా,ప్యాకింగ్ ధరలు పెరగడంతో నిర్ణయం తీసుకున్న బీర్ కంపెనీలు
  • ఒక్కొక్క బీరుపై 10-15 శాతం పెంచేందుకు నిర్ణయం
Hike in Beer Prices: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్, పెరగనున్న బీరు ధరలు, ఒక్కొక్క బీర్ ఎంతంటే..??

Hike Beer Prices: మందుబాబులకు ఇది బ్యాడ్‌న్యూస్. మండు వేసవిల్లో చల్లగా కిక్కిచ్చే బీర్ కొండెక్కనుంది. త్వరలో ఒక్కొక్క బీరుపై భారీగానే ధర పెరగనుంది.

మందుబాబులు ప్రతి ఒక్కరికీ బీర్ అంటే ఇష్టముంటుంది. అందులో వేసవిలో అయితే ముందుగా ప్రిఫర్ చేసేది బీరే. మండుటెండల్లో చల్లగా లోపలకు దిగుతూ కిక్కిస్తుంటుంది. అందుకే బీర్ అంటే ఇష్టపడనివారుండరు. బార్లీ నేపధ్యం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదనే కాన్సెప్ట్‌తో మరికొందరు ఇష్టపడుతుంటారు. కారణాలేమనుకున్నా...వేసవి వచ్చిందంటే చాలు బీర్లకు ఫుల్ డిమాండ్. ఎంత డిమాండ్ అంటే ఛిల్డ్ బీర్ దొరకని పరిస్థితులుంటాయి.

ఇప్పుడీ వేసవి పూర్తిగా బీర్లతో ఎంజాయ్ చేయకముందే..ఇంకా మే నెల రాకముందే మందుబాబులకు ముఖ్యంగా బీరు బాబులకు షాక్ తగలనుంది. బీర్ ధరల్ని పెంచేందుకు కంపెనీలు సిద్ధమౌతున్నాయి. బీరు తయారీలో ముఖ్యమైన ముడి సరుకు బార్లీ  రేట్లు పెరగడం ప్రధాన కారణం. బార్లీ ధర ఈ ఏడాది 65 శాతం పెరిగింది. ఇక దాంతోపాటు రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులు కూడా పెరిగాయి. ఫలితంగా బీర్ ధరల్ని 10-15 శాతం పెంచేందుకు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అంటే ఒక్కొక్క బీర్‌పై 20-30 రూపాయలు పెరగడం ఖాయం.

Also read: Ganesh Puja Tips: బుధవారం గణపతి పూజ... ఈ నియమాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి...  

Also Read: India Corona Cases: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. భారీగా కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News