మరో రికార్డు బ్రేక్ చేసిన మహిళా క్రికెటర్ 'మిథాలీరాజ్'

భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డు బ్రేక్ చేశారు. క్రికెట్ చరిత్రలో అత్యధిక వన్డేలు ఆడిన తొలి మహిళగా ఆమె వార్తల్లోకెక్కారు

Last Updated : Apr 6, 2018, 02:02 PM IST
మరో రికార్డు బ్రేక్ చేసిన మహిళా క్రికెటర్ 'మిథాలీరాజ్'

భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డు బ్రేక్ చేశారు. క్రికెట్ చరిత్రలో అత్యధిక వన్డేలు ఆడిన తొలి మహిళగా ఆమె వార్తల్లోకెక్కారు. ఇప్పటి వరకూ ఆమె అన్నీ కలిపి 192 వన్డేలు ఆడారు. ఈ క్రమంలో 191 వన్డేలు ఆడిన ఇంగ్లాండ్‌ మాజీ మహిళా క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ రికార్డును బ్రేక్ చేశారు. నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మహిళా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా మిథాలీ ఈ కొత్త రికార్డు నమోదు చేశారు.

ఈ192 వన్డే మ్యాచ్‌ల్లో మిథాలీ రాజ్ 6,295 పరుగులు చేయడం గమనార్హం. మరొక విషయమేంటంటే.. వన్డే క్రికెట్‌లో ఆరువేల పై చిలుకు పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్ కూడా మిథాలీ రాజే కావడం విశేషం. భారత మహిళల క్రికెట్ జట్టును రెండు సార్లు ప్రపంచ కప్ ఫైనల్‌కు తీసుకెళ్లిన ఘనత కూడా మిథాలీరాజ్‌దే కావడం విశేషం

భారత క్రీడారంగంలో అత్యున్నతమైన సేవలు అందించినందుకు గాను అర్జున అవార్డు 2003 సంవత్సరానికిగాను మిథాలిరాజ్‌కు ప్రధానం చేయబడింది. అలాగే 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఆమె పొందారు. 2017లో బిబిసి ప్రపంచవ్యాప్తంగా 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో మిథాలీరాజ్‌కు కూడా చోటు కల్పించింది. మిథాలీరాజ్ అభిమానులు ఆమెను "టెండుల్కర్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్"అని పిలుచుకుంటూ ఉంటారు

Trending News