Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్... సక్సెస్ మీట్ ఎక్కడంటే...

Sarkaru Vaari Paata Grand Success Celebrations: 'సర్కారు వారి పాట' బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌కు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించనున్నారంటే...   

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 03:57 PM IST
  • సర్కారు వారి పాట అప్‌డేట్స్
  • రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న మూవీ
  • సక్సెస్ మీట్‌కు సిద్ధమవుతోన్న చిత్ర యూనిట్
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్... సక్సెస్ మీట్  ఎక్కడంటే...

Sarkaru Vaari Paata Grand Success Celebrations: సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. గురువారం (మే 12) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు కొల్లగొడుతోంది. సినిమా సూపర్ హిట్‌తో చిత్ర యూనిట్‌ సెలబ్రేషన్ మూడ్‌లో ఉంది. ఈ సక్సెస్‌ను మహేష్ అభిమానులతో పంచుకునేందుకు మూవీ మేకర్స్ ఈ నెల 16వ తేదీ సాయంత్రం బిగ్ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు. విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్స్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

కలెక్షన్ల విషయానికొస్తే.. సర్కారు వారి పాట తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తొలి రెండు రోజుల్లో రూ.47 కోట్ల షేర్, రూ.66.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజుల్లో రూ.58.15 కోట్ల షేర్, రూ.90 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి సర్కారు వారి పాట వసూళ్ల జోరు ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. 

'సర్కారు వారి పాట'లో మహేష్ పెర్ఫామెన్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలో దర్శకుడు పరశురాం సరికొత్త మహేష్ బాబును చూపించారని అంటున్నారు. మహేష్ స్టైలిష్ లుక్, డైలాగ్ మాడ్యులేషన్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. బ్యాంకులు, సామాన్యుల అప్పుల చుట్టూ పరశురాం చెప్పిన కథ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బ్లస్టర్ పడినట్లయింది. మహేష్, కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి. 

Also Read: New Job Suggestions: కొత్త కంపెనీకి వెళ్తున్నారా .. అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..!

Also Read: India Bans Wheat Exports: గోధుమ ఎగుమతులపై కేంద్రం నిషేధం... ఎందుకీ నిర్ణయం... కారణాలివే...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News