Sravanam Month: శ్రావణమాసంలో ఆ ఐదు ధాన్యాలు సమర్పిస్తే..అంతులేని సంపద మీ సొంతం, మరో నెల రోజులే

Sravanam Month: ఆషాఢం తరు వాత వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసం భోళానాధుడు అంటే శివుడికి ప్రత్యేకం. ఈ నెలలో శివుడి కటాక్షం పొందేందుకు ఆ పని తప్పకుండా చేయాలంటున్నారు పండితులు. అదేంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 15, 2022, 08:37 PM IST
Sravanam Month: శ్రావణమాసంలో ఆ ఐదు ధాన్యాలు సమర్పిస్తే..అంతులేని సంపద మీ సొంతం, మరో నెల రోజులే

Sravanam Month: ఆషాఢం తరు వాత వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసం భోళానాధుడు అంటే శివుడికి ప్రత్యేకం. ఈ నెలలో శివుడి కటాక్షం పొందేందుకు ఆ పని తప్పకుండా చేయాలంటున్నారు పండితులు. అదేంటో చూద్దాం.

హిందూమతంలో శ్రావణమాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆషాఢం తరువాత వచ్చే నెలతోపాటు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెలగా భావిస్తారు. ఈ నెలంతా భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే..శివుడి కటాక్షం వెంటనే లభిస్తుందని అంటారు. శివుడైతే ఓ చెంబు నీళ్లతోనే ప్రసన్నుడైపోతాడు. శ్రావణమాసంలో శివుడి కటాక్షం కోసం 5 రకాల ధాన్యాల్ని అర్పించాలట. అలా చేస్తే చాలా లాభాలుంటాయి. భక్తుల కష్టాల్ని శివుడు దూరం చేస్తాడు. వారి కోరికల్ని పూర్తి చేస్తాడు. 

హిందూధర్మంలో అక్షింతలకు విశేష ప్రాధాన్యత ఉంది. శ్రావణంలో ఒకవేళ శివలింగంపై అక్షింతలు వేస్తే..చాలా లాభాలుంటాయని అంటారు. శివుడికి ఓ గుప్పెడు బియ్యం అర్పిస్తే లక్ష్మీ లభిస్తుంది. చిక్కుకుపోయిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. అయితే బియ్యం విరిగిపోయుండకూడదు. మరోవైపు హిందూధర్మంలో గోధుమలకు చాలా ప్రాధాన్యత ఉంది. శ్రావణంలో శివలింగంపై గుప్పెడు గోధుమలు వేస్తే అన్ని సంసారపరమైన సుఖాలు లభిస్తాయి. అటు ఆ వ్యక్తికి సంతాన సుఖం కూడా కలుగుతుంది. 

ఇక నల్ల నువ్వులు శివుడికి చాల ఇష్టమైనందున ఇవి సమర్పిస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని దుఖాలు, కష్టాలు దూరమౌతాయి. ఆ వ్యక్తి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు. దాంతోపాటు హఠాత్తుగా ఎదురయ్యే సమస్యలు దూరమౌతాయి. ఇక పప్పులు కూడా శివుడికి శ్రావణంలో తప్పకుండా అర్పించాల్సినవి. దీనివల్ల ఆ వ్యక్తికి అష్ట ఐశ్వర్యాలు, డబ్బులు లభిస్తాయి. జీవితంలో అన్ని కష్టాలు దూరమౌతాయి. చివరిగా పెసర. ఇవి కూడా శివుడికి ఇష్టమైనవి. శ్రావణమాసంలో శివలింగంపై పెసర అర్పిస్తే...శివుడు ప్రసన్నమౌతాడు. అన్ని కష్టాలు దూరమౌతాయి. 

Also read: Chanakya Niti: మోక్షం పొందడానికి చాణక్యుడు చెప్పిన అద్బుతమైన 4 విషయాలు తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News