Minister Roja: తాజాగా మంత్రి రోజాకు నిరసన సెగ తగిలింది. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా వడమాల పేట మండలం బుట్టిరెడ్డి కండ్రిగలో ఘటన చోటు చేసుకుంది. రహదారుల నిర్మాణం బిల్లులకు సంబంధించి మంత్రి రోజా ఎదురుగానే మాజీ సర్పంచ్, అతడి భార్య నిరసన తెలిపారు. వైసీపీ పార్టీని నమ్ముకుంటే అప్పుల పాలు చేశారని వాపోయారు.
గ్రామంలో మంత్రి రోజా పర్యటించారు. ఈసందర్భంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ సమస్యలపై ఫ్లెక్సీలు తయారు చేశారు. పనులు చేయనివారికి బిల్లులు మంజూరు చేశారని అందులో పేర్కొన్నారు. కింద తెలిపిన వ్యక్తులను ఎప్పుడైన చూశారా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతల నుంచే ఎలా రావడం ఏంటని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వస్తోందని..దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. ప్రతి పనిలో వైసీపీ నేతలు అవినీతి పాల్పడుతున్నారని..దీనిపై ప్రజా పోరాటం చేస్తామంటున్నారు.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..!
Also read:Godavari Floods: గోదావరి మహోగ్రరూపం..ధవళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద హై అలర్ట్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Minister Roja: చిత్తూరు జిల్లాలో మంత్రి రోజాకు నిరసన సెగ..కోల్డ్ వారే కారణమా..?
వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోందా?
తాజాగా మంత్రి రోజాకు నిరసన సెగ
హాట్ టాపిక్‌గా మారిన వివాదం