Rise Of Mercury 2022: మేధస్సు, తర్కం, డబ్బు, వ్యాపారానికి కారుకుడు బధుడు. మెర్క్యురీ గ్రహాన్ని జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అంటారు. నిజానికి బుధుడు చాలా చిన్న గ్రహం. కానీ మెర్క్యురీ గ్రహం యొక్క స్థితిలో స్వల్ప మార్పు కూడా ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. ఇటీవల జూలై 17, 2022న, బుధ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. అలాగే బుధ గ్రహం జూలై 29, 2022న ఉదయించనుంది. దీని ప్రభావం మూడు రాశులవారికి కలిసి రానుంది.
మిథునం (Gemini): బుధుడు ఉదయించడం మిథునరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా వ్యాపారులు లాభపడతారు. వారు పెద్ద ఆర్డర్లను పొందవచ్చు. ఈ సమయంలో మార్కెటింగ్, లాయర్, టీచర్ వంటి స్పీకింగ్ వర్క్‌లో నిమగ్నమైన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు.
కన్య (Virgo): ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో లాభాలు చేకూరుతాయి. వారి ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీరు కొత్త మార్గాల్లో డబ్బు పొందుతారు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మొత్తం మీద, ఈ సమయం ఈ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో లాభాలు ఉండవచ్చు.
తుల (Libra): బుధుడు ఉదయించడం వల్ల తుల రాశి వారి కెరీర్లో గొప్ప పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగం రావచ్చు. ప్రస్తుత ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్-ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారుల నెట్వర్క్ పెరుగుతుంది. లాభాలను భారీగా ఆర్జిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.
Also Read: Shani Gochar effect: శనిగ్రహ సంచారం... మారనున్న ఈ 3 రాశుల ఫేట్!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook