Lakshmi Devi Remedies: ఆస్ట్రాలజీ ప్రకారం.. గ్రహాలు, రాశుల స్థానం యెుక్క ప్రభావం వ్యక్తి జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంది. మీ జాతకంలో గ్రహాల స్థానం అనుకూలంగా ఉంటే.. మీకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ మీ కుండలిలో గ్రహాల అశుభ స్థానంలో ఉంటే మీరు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. జాతకంలో గ్రహాల స్థితి సరిగా లేకపోతే మీరు వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. జ్యోతిష్యశాస్త్రంలో అటువంటి మూడు గ్రహాలు గురించి చెప్పుకుందాం. దీని వల్ల మీరు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఆ మూడు గ్రహాలే కుజుడు,రాహువు, శని. వీటి చెడు ప్రభావం ఏ వ్యక్తిపై పడుతుందో ఆ వ్యక్తి తీవ్ర దుష్ప్రభావాలను ఎదుర్కొంటారు.
ఇలా బయటపడండి
>> మీపై అప్పుల భారం పెరిగిపోతుంటే... రోజూ ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. దీంతో పాటు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తికి సూర్యభగవానుడు విజయాన్ని, శాంతిని అనుగ్రహిస్తాడు. అంతే కాకుండా మంగళవారం రోజున ఆంజనేయుడి దేవాలయంలో హనుమాన్ చాలీసా పఠించడం వలన జీవితంలో సుఖశాంతులు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
>> లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే... మీ నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకోండి. అంతేకాకుండా ఒక నెలలో వచ్చే అన్ని శుక్రవారాల్లో ముగ్గురు పెళ్లికాని అమ్మాయిలకు ఖీర్ తినిపించండి. వారికి ఎరుపు లేదా పసుపు బట్టలు ఇచ్చి పంపించండి. దీంతో తల్లి లక్ష్మి సంతోషించి ఆ ఇంట్లో నివాసం ఉంటోంది.
>> పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల అప్పులు పెరుగుతాయి కాబట్టి ఎలాంటి చెత్త వస్తువులను ఇంట్లో ఉంచవద్దు. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మీపై లక్ష్మీదేవి డబ్బు వర్షం కురుస్తుంది.
>> డబ్బు సమస్యల నుండి బయటపడటాలంటే...కుబేరుడి అనుగ్రహం మీపై ఉండాలి. దీని కోసం ఆ దేవుడిని పూజించాలి. ముఖ్యంగా ఉత్తర దిశ వైపు ఉండి కుబేరుడిని పూజించండి.
Also Read: Rakshabandhan 2022: భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం అశుభం, కారణం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook